పాకిస్తాన్ లో విషాదం: పెషావర్‌ మసీదులో బాంబు పేలి 30 మంది మృతి

Published : Mar 04, 2022, 03:05 PM ISTUpdated : Mar 04, 2022, 03:33 PM IST
పాకిస్తాన్ లో విషాదం: పెషావర్‌ మసీదులో బాంబు పేలి 30 మంది మృతి

సారాంశం

పాకిస్తాన్ లో బాంబు పేలుడు చోటు చేసుకొంది.ఈ ఘటనలో 30 మంది మరణించారు. పెషావర్ రిసల్దార్ మసీదులో  బాంబు పేలిందని స్థానిక మీడియా ప్రకటించింది.


ఇస్లామాబాద్: పాకిస్తాన్ లోని Peshawar లోRisaldar  లో గల mosque లో శుక్రవారం నాుడ జరిగిన బాంబు పేలుడులో 30 మంది మరణించారు. ఈ మేరకు స్థానిక మీడియా ప్రకటించింది.

మసీదు వద్ద నమాజ్ చేసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చిన స.మయంలో ఈ పేలుడు చోటు చేసుకొంది. ఈ ఘటనలో 30 మంది అక్కడికక్కడే మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

 ఈ విషయాన్ని స్థానిక పోలీస్ అధికారి వహీద్ ఖాన్ చెప్పారు. క్షతగాత్రులను సమీపంలోని  ఆసుపత్రికి తరలించారు. మసీదులో నమాజ్  చేసేందుకు తాను వెళ్తున్న సమయంలో భారీ శబ్దంతో పేలుడు చోటు చేసుకొందని షాయన్ హైదర్ అనే వ్యక్తి చెప్పారు. ఈ పేలుడు ధాటికి తాను మసీదు బయట పడ్డానని మీడియాకు తెలిపారు.  తాను ఈ ధాటికి స్పృహా కోల్పోయాయని ఆయన చెప్పారు. అయితే తాను స్పృహలోకి వచ్చిన తర్వాత తన చుట్టూ క్షతగాత్రులతో పాటు మృతదేహలు కన్పించాయని ఆయన వివరించారు. 

ఈ బాంబు దాడిని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా ఖండించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Fake Doctors : పాకిస్థాన్ మొత్తం శంకర్ దాదా ఎంబిబిఎస్ లే.. ఎంతమంది నకిలీ డాక్టర్లున్నారో తెలుసా?
భార్యకు భరణం ఇవ్వాల్సి వస్తుందని.. రూ.6 కోట్ల శాలరీ జాబ్ వదులుకున్న భర్త.. కోర్టు ఆసక్తికర తీర్పు