Russia Ukraine War: మనల్ని ట్రాప్ చేశారు.. తోటి జవానులారా.. స్వదేశం వెళ్లిపోండి: ఉక్రెయిన్‌లో రష్యా సైనికుడు

Published : Mar 04, 2022, 03:00 PM ISTUpdated : Mar 04, 2022, 03:08 PM IST
Russia Ukraine War: మనల్ని ట్రాప్ చేశారు.. తోటి జవానులారా.. స్వదేశం వెళ్లిపోండి: ఉక్రెయిన్‌లో రష్యా సైనికుడు

సారాంశం

ఉక్రెయిన్ పౌరులు పట్టుకున్న ఓ రష్యా జవాను ఆశ్చర్యకర విషయాలు వెల్లడించారు. తమ పై అధికారులు చెప్పిన దానికి ఇక్కడ వాస్తవంలో ఉన్నదానికి సంబంధమే లేదని వివరించారు. వారు తమను ట్రిక్ చేసి ఇక్కడకు పంపారని అన్నారు. అందుకే వీలైనంత త్వరగా ఉక్రెయిన్ వదిలి స్వదేశానికి వెళ్లిపోవాలని తోటి జవాన్లను కోరారు.  

న్యూఢిల్లీ: యుద్ధం ఎప్పుడూ ఊహించినట్టుగా ఉండదు. ఎప్పటికప్పుడు ఎత్తులు పై ఎత్తులు మారుతూనే ఉంటాయి. హఠాత్పరిణామాలు ఎన్నో ఎదురు అవుతూ ఉంటాయి. ఇవి ఏ యుద్ధంలోనైనా ఉండేవే. కానీ, యుద్ధ సన్నద్ధంలో కొన్ని కీలక వ్యూహాలు ఎప్పటికీ మారవు. అందులో సైనికుల్లో ప్రేరణ నింపడం. ఈ సారి రష్యా అధికారులు తమ సైనికుల్లో నింపిన ఉత్సాహం తొందరగానే ఆవిరయ్యేలా కనిపిస్తున్నది. ఎందుకంటే.. ఉక్రెయిన్‌లో రష్యా మాట్లాడేవారిని రక్షించడానికే తాము ఈ సైనిక చర్య ప్రారంభించినట్టు రష్యా ప్రకటించింది. అదే విషయాన్ని రష్యా సైనికుల్లో (Russia Soldier)నూ నూరిపోసింది. వారు ఉక్రెయిన్‌ (Ukraine)లో అడుగుపెడితే.. అడుగడుగునా స్వాగతాలు అందుతాయని చెప్పారు. ఉక్రెయిన్‌లో ఎక్కడా రష్యా సైనికులకు వ్యతిరేకత ఎదురు కాదని అధికారులు చెప్పారు. కానీ, క్షేత్రస్తాయిలో వాస్తవాలు వేరుగా ఉన్నాయి. రష్యా సైనికులను అడ్డుకోవడానికి ఉక్రెయిన్ పౌరులు స్వయంగా ముందుకు వచ్చారు. వారి వాహనాలను అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. కొందరైతే.. యుద్ధ ట్యాంకులకు అడ్డంగా వెళ్లి వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఉక్రెయిన్ పౌరులూ రష్యా సైనికులను తమ కస్టడీలోకి తీసుకుంటున్నారు. తమ అదుపులోకి తీసుకుని వారి ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు. టీ తాగించి వారి ఆప్తులతో ఫోన్‌లో మాట్లాడిస్తున్నారు. తద్వార పట్టుబడ్డ రష్యా సైనికులు మానసికంగా ఎంతో ఉద్విజ్ఞతకు లోనవుతున్నారు. తాజాగా, ఇలాంటి ఘటనే ఒకటి ఎదురైంది. అంతేకాదు, ఆ రష్యా సైనికుడు.. తోటి వారికీ ఓ సందేశాన్ని ఇచ్చాడు.

పట్టుకున్న సైనికుడికి టీ తాగించి ఆయన అమ్మతో ఫోన్‌లో మాట్లాడించారు. అదే సందర్భంలో ఆయన తోటి రష్యా జవాన్లకు ఎలాంటి సందేశం ఇస్తారని అడగ్గా.. ఆశ్చర్యకర సమాధానం ఇచ్చారు. ఫ్రాంక్‌గా మాట్లాడితే.. మా పై అధికారులు మమ్మల్ని ట్రిక్ చేశారు. ఆ ట్రాప్‌ (Trap)లో పడి మేం ఇక్కడకు వచ్చాం. నిజం చెప్పాలంటే.. మా దాంట్లో 90 శాంత మంది ఇప్పటికీ తిరిగి స్వదేశానికి అంటే రష్యాకు వెళ్లాలనే భావిస్తున్నారని వివరించారు. 

పై అధికారులు తమకు చెప్పినవన్నీ తప్పుడు విషయాలే చెప్పారని ఆ సైనికుడు ఆవేదన చెందాడు. అందుకే నేను నా తోటి సైనికులను వీలైనంత త్వరగా ఉక్రెయిన్ వదిలి ఇంటికి వెళ్లిపోమానే చెబుతాను. ఎందుకంటే.. మాకు ఓ కుటుంబం ఉన్నది. పిల్లలూ ఉన్నారు. మా కంటూ ఓ జీవితం ఉన్నదని పేర్కొన్నారు. మా అధికారులు మమ్మల్ని ట్రాప్ చేశారని వివరించారు.

కొందరు రష్యా సైనికులు తాము చేస్తున్న పనిని ఇష్టపడక.. వారిని మోసుకొచ్చిన ఆర్మీ వాహనాలనూ స్వయంగా ధ్వంసం చేసినట్టు కథనాలు వచ్చాయి.

ఉక్రెయిన్‌లో సాధారణ పౌరులు, సెలెబ్రిటీలు, వృద్ధులూ తుపాకులు పట్టుకుని తాము శత్రువులతో పోరాడటానికి సిద్ధం అని చెప్పడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే