చైనాలో ఘోర ప్రమాదం.. బస్సు బోల్తా పడి 27 మంది మృతి..

Published : Sep 18, 2022, 01:46 PM IST
చైనాలో ఘోర ప్రమాదం.. బస్సు బోల్తా పడి 27 మంది మృతి..

సారాంశం

చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు బోల్తా పడిన ఘటన 27 మంది మరణించారు. ఇది ఈ ఏడాది చైనాలో జరిగిన అత్యంత ఘోరమైన రోడ్డు ప్రమాదం అని పోలీసులు తెలిపారు.

చైనాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు బోల్తా పడిన ఘటన 27 మంది మరణించారు. 20 మందికి గాయాలయ్యాయి. అయితే ఇది ఈ ఏడాది దేశంలో జరిగిన అత్యంత ఘోరమైన రోడ్డు ప్రమాదం అని పోలీసులు తెలిపారు. వివరాలు.. నైరుతి చైనాలోని గుయిజౌ ప్రావిన్స్‌లోని హైవేపై ప్రయాణిస్తున్న బస్సు బోల్తా పడింది. అదుపు తప్పి పల్టీలు కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 47 మంది ఉన్నారు. వీరిలో 20 మంది మరణించగా.. గాయపడిన 20 మంది ప్రస్తుతం ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. 

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే సహాయక సిబ్బందిని ఘటన స్థలానికి పంపించినట్టుగా పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై అక్కడి పోలీసులు సోషల్ మీడియాలో ఒక ప్రాథమిక ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది జూన్‌లో గుయిజౌ ప్రావిన్స్‌లో హైస్పీడ్ రైలు పట్టాలు తప్పడంతో ఒక వ్యక్తి మరణించాడు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Train Accident: ఘోర రైలు ప్రమాదం.. 22 మంది మృతి. భారీ క్రేన్ పడడంతో..
Iran: అస‌లు ఇరాన్‌లో ఏం జ‌రుగుతోంది.? నిజంగానే 12 వేల మంది మ‌ర‌ణించారా.?