అగ్రరాజ్యంలో పేట్రేగిపోతున్న గన్ కల్చర్ .. భారతీయ సంతతి విద్యార్థిపై కాల్పులు.. 

By Rajesh KarampooriFirst Published May 30, 2023, 5:38 AM IST
Highlights

అమెరికాలోని ఫిలడెల్ఫియాలో 21 ఏళ్ల భారతీయ సంతతి విద్యార్థిని కాల్చి చంపినట్లు ఖలీజ్ టైమ్స్ సోమవారం నివేదించింది. మృతి చెందిన విద్యార్థిని జూడ్ చాకోగా గుర్తించారు. అతను తన పని నుండి తిరిగి వస్తుండగా, గుర్తు తెలియని దుండగులు అతనిపై కాల్పులు జరిపారు.

అమెరికా అగ్రరాజ్యం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. దేశంలో విచ్చలవిడిగా  గన్ కల్చర్ పెరిగిపోతుంది. సాయుధులు యధేచ్ఛగా కాల్పులకు తెగబడ్డారు. అత్యాధునిక ఆయుధాలు చేతపట్టిన దుండ‌గులు కాల్పుల‌కు తెగబ‌డుతున్నారు. తాజాగా  పెన్సిల్వేనియాలోని  ఫిలడెల్ఫియాలో దారుణం జరిగింది. భారతీయ సంతతికి చెందిన విద్యార్థి కాల్చి చంపబడ్డాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)కి చెందిన ఆంగ్ల వార్తాపత్రిక ఖలీజ్ టైమ్స్‌ సమాచారాన్ని అందించింది. మృతి చెందిన విద్యార్థిని జూడ్ చాకోగా గుర్తించారు. వార్తాపత్రిక కథనం ప్రకారం.. భారత సంతతికి చెందిన విద్యార్థి తన పని నుండి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు.

 
నివేదికల ప్రకారం.. మృతుడి తల్లిదండ్రులు 30 సంవత్సరాల క్రితం కేరళలోని కొల్లం జిల్లా నుండి అమెరికాకు వలస వచ్చి అక్కడ నివసిస్తున్నారు. జూడ్ చాకో విద్యార్థి అని, అతను పార్ట్‌టైమ్ గా ఓ కంపెనీలో పనిచేశాడని నివేదిక పేర్కొంది. దోపిడీకి యత్నించి ఇద్దరు వ్యక్తులు అతనిపై దాడి చేశారు. ఈ క్రమంలో అతడు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది అమెరికాలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి .అంతకుముందు భారత సంతతికి చెందిన ఓ విద్యార్థిని లక్ష్యంగా చేసుకుని హత్య చేశారు.

గతంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్థి హత్య

ఇంతకుముందు..  2023 ఏప్రిల్ 21న అమెరికాలోని ఓ ఫ్యూయల్ స్టేషన్ లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 24 ఏళ్ల విద్యార్థిని కాల్చి చంపారు.  ఓహియోలోని ఓ పెట్రోలు పంపులో పని చేస్తున్న సాయిష్ వీరగా పోలీసులు గుర్తించారు. విధుల్లో ఉండగా గుర్తుతెలియని దుండగులు అతడిని కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు నిందితుడి ఫోటోను విడుదల చేశారు . నిందితులను గుర్తించడంలో సహాయం కోరారు.

click me!