రైలుని ఢీకొట్టిన బస్సు... 20మంది మృతి

Published : Feb 29, 2020, 08:46 AM IST
రైలుని ఢీకొట్టిన బస్సు... 20మంది మృతి

సారాంశం

సుక్కూర్ జిల్లాలోని రోహ్రీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కరాచీ నుంచి సర్గోధా వెళ్తున్న బస్సు మానవరహిత రైల్వే క్రాసింగ్‌ను దాటి పాకిస్తాన్ ఎక్స్‌ప్రెస్ రైలును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.   


రైల్వే ట్రాక్ దాటుతూ ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ సంఘటన పాకిస్తాన్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో దాదాపు 20మంది ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్‌లోని సింధ్ ప్రాంతంలోమానవరహిత రైల్వే క్రాసింగ్‌ను దాటే ప్రయత్నంలో ఒక బస్సు రైలును ఢీకొంది.

ఈ ఘటనలో అక్కడికక్కడే 20మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సుక్కూర్ జిల్లాలోని రోహ్రీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కరాచీ నుంచి సర్గోధా వెళ్తున్న బస్సు మానవరహిత రైల్వే క్రాసింగ్‌ను దాటి పాకిస్తాన్ ఎక్స్‌ప్రెస్ రైలును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. 

Also Read పీకల దాకా తాగి హైడ్ అండ్ సీక్: బాయ్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో పెట్టి కునుకు...

ఈ ఘటనలో 20 మంది మరణించినట్లు సుక్కూర్ కమిషనర్ షఫీక్ అహ్మద్ మెహ్సర్ ధృవీకరించారు. గాయపడిన పలువురి పరిస్థితి విషమంగా ఉన్నందున, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. కాగా ఈ ప్రమాదంలో బస్సు తునాతునకలయ్యింది. 

ఇది ఘోర ప్రమాదమని సుక్కూర్ పోలీసు అధికారి జమీల్ అహ్మద్ పేర్కొన్నారు. ఈ ఘటనలో ఆ రైలు... బస్సును 150 నుంచి 200 అడుగుల వరకు లాక్కొని వెళ్లిపోయిందన్నారు. కాగా సింధ్ ముఖ్యమంత్రి మురాద్ అలీ షా ఘటనా స్థలానికి తక్షణం సహాయక బృందాలను తరలించాలని సుక్కూర్ కమిషనర్‌ను ఆదేశించారు. 
 

PREV
click me!

Recommended Stories

ఆట‌గాళ్ల‌కు కండోమ్ స‌మ‌స్య‌.. 3 రోజుల్లోనే 10 వేల స్టాక్ ఖ‌తం. అస‌లేంటీ కండోమ్‌ల గొడ‌వ‌
Interesting Facts: ఈ గ్రామంలో అస్సలు వ‌ర్షం ప‌డ‌దు.. కార‌ణం ఏంటో తెలుసా.?