
అమెరికాలోని నార్త్ లాస్ వెగాస్ విమానాశ్రయంలో రెండు చిన్న విమానాలు ఎదురెదురుగా ఆదివారం ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. ఈ విషయాన్ని స్థానిక అధికారులు ధృవీకరించారు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం సమయంలో ఒకే ఇంజన్ పైపర్ PA-46, సింగిల్ ఇంజిన్ సెస్నా-172 ఢీకొన్నాయని తెలిపారు.
‘‘ సెస్నా 172తో ఢీకొన్నప్పుడు పైపర్ PA-46 ల్యాండ్ కావడానికి ప్రయత్నిస్తోంది. ఈ సమయంలోనే ప్రమాదం జరిగిందని ప్రాథమిక సమాచారం తెలుపుతోంది ’’ అని FAA ఒక ప్రకటనలో తెలిపింది. ‘‘పైపర్... రన్‌వే -30 కుడివైపు తూర్పున ఉన్న మైదానంలోకి దూసుకెళ్లింది. సెస్నా నీటిని నిలుపుకునే చెరువులో పడిపోయింది.’’ అని పేర్కొంది.
బంగ్లాదేశ్‌లో హిందూ దేవాలయంపై దాడి.. హిందువుల ఇళ్లు, దుకాణాలు ధ్వంసం..
సిటీ ఫైర్ డిపార్ట్ మెంట్ ఆఫీసర్లు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక్కో విమానంలో ఇద్దరు ఉన్నారు. ఈ ప్రమాదం జరగడంతో నలుగురు మరణించారు. అయితే బాధితుల పేర్లు, వయస్సు, స్వస్థలాలు ఎక్కడనే విషయం ఇంకా విడుదల చేయలేదు. కాగా ఈ ప్రమాదానికి అసలు కారణం ఏంటనే విషయాన్ని నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్, FAA క్రాష్‌కి పరిశీలిస్తున్నాయి.