పాకిస్తాన్‌లో ఇద్దరు భారత అధికారుల అదృశ్యం

Published : Jun 15, 2020, 11:52 AM IST
పాకిస్తాన్‌లో ఇద్దరు భారత అధికారుల అదృశ్యం

సారాంశం

పాకిస్తాన్‌లో పనిచేస్తున్న ఇద్దరు భారత అధికారులు అదృశ్యమైనట్టుగా తెలుస్తోంది. గత రెండు గంటలుగా ఈ అధికారులు కన్పించకుండా పోయారని రిపోర్టులు చెబుతున్నాయి. 

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో పనిచేస్తున్న ఇద్దరు భారత అధికారులు అదృశ్యమైనట్టుగా తెలుస్తోంది. గత రెండు గంటలుగా ఈ అధికారులు కన్పించకుండా పోయారని రిపోర్టులు చెబుతున్నాయి. 

ఈ ఇద్దరు కూడ పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని ఇండియన్ హై కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్నారు.అదృశ్యమైన వారిలో సీఐఎస్ఎఫ్ డ్రైవర్. ఇతను భారత హై కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. మరొకరు ఇదే కార్యాలయంలో పనిచేస్తున్న అధికారిగా చెబుతున్నారు.

పాకిస్తాన్ ప్రభుత్వం ఈ ఘటనపై విచారణ జరుపుతోంది. పాకిస్తాన్ ఇంటర్ సర్వీస్ ఇంటలిజెన్స్ (ఐఎస్ఐ) భారత దౌత్య అధికారులను అనుసరిస్తారనే ప్రచారం ఉంది.

గూఢచర్యం ఆరోపణలపై పాకిస్తాన్ కు చెందిన ఇద్దరు దౌత్య అధికారులను న్యూఢిల్లీ నుండి ఇండియా బహిష్కరించింది. ఈ ఘటన జరిగి పది రోజులు అవుతోంది.  గూఢచర్యానికి పాల్పడినందుకు గాను పాకిస్తాన్ కు చెందిన  ఆ ఇద్దరిని కూడ అరెస్ట్ చేసినట్టుగా భారత్ ప్రకటించింది.

అరెస్టైన వారిలో ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషనర్ కాన్సులర్ కార్యాలయంలో పనిచేస్తున్న అబిద్ హుస్సేన్, మహ్మద్ తాహిర్ లుగా చెబుతున్నారు. ఈ విషయమై అధికారులు మాత్రం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
 

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !