అమెరికాలో మరో దారుణం: పోలీసుల కాల్పుల్లో మరో నల్ల జాతీయుడి మరణం

By narsimha lodeFirst Published Jun 14, 2020, 12:01 PM IST
Highlights

 అమెరికాలో మరో నల్లజాతీయుడు మృతి చెందాడు. దీంతో అట్లాంటాలో భారీ ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా దేశ వ్యాప్తంగా నిరసనలు పెల్లుబికుతున్న తరుణంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో పోలీసుల తీరుపై విమర్శలకు తావిచ్చింది.


అట్లాంటా: అమెరికాలో మరో నల్లజాతీయుడు మృతి చెందాడు. దీంతో అట్లాంటాలో భారీ ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా దేశ వ్యాప్తంగా నిరసనలు పెల్లుబికుతున్న తరుణంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో పోలీసుల తీరుపై విమర్శలకు తావిచ్చింది.

అట్లాంటాలోని వెండీ రెస్టారెంట్ ముందు రెషార్డ్ బ్రూక్ అని 27 ఏళ్ల వ్యక్తి శుక్రవారం నాడు రాత్రి తన కారును ఆపి అందులోనే నిద్రపోయాడు.

అయితే ఇతర కష్టమర్లకు అసౌకర్యం కల్గిస్తున్నాడని ఆరోపిస్తూ రెస్టారెంట్ యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో అక్కడికి చేరుకొన్న పోలీసులు అక్కడికి చేరుకొన్నారు.

కారులో ఉన్న బ్రూక్ మత్తులో ఉన్నాడని పోలీసులు గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తే అతడు ప్రతిఘటించాడు. పోలీసుల చేతిలోని తుపాకీని పట్టుకొని పారిపోయేందుకు ప్రయత్నించాడు.

పోలీసులు అతడిని వెంటాడారు. పోలీసులపై అతను కాల్పులకు దిగాడు. బ్రూక్ ను ఆపేందుకు పోలీసులు అతడి కాళ్లపై కాల్పులకు దిగాడని పోలీసులు చెప్పారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రూక్ మరణించాడు. ఈ ఘటన అంతా స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో  రికార్డు అయింది. ఈ దృశ్యాల ఆధారంగానే ఈ నివేదిక తయారు చేసినట్టుగా పోలీసులు ప్రకటించారు.

జార్జ్ ఫ్లాయిడ్ ఘటన తర్వాత బ్రూక్ కూడ పోలీసుల చేతిలోనే మరణించడంతో నిరసన జ్వాలలు మిన్నంటాయి.
భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చిన ఆందోళనకారులు నిరసనలు చేపట్టారు. ఘటన జరిగిన రెస్టారెంట్ కు సమీపంలోని కార్లకు నిప్పంటించారు. 

ఈ ఆందోళనలతో కాల్పులు జరిపిన పోలీసులను వెంటనే విధుల నుండి తప్పించాలని మేయర్ కేషా లాన్స్ బాటమ్స్ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ నగర పోలీస్ చీఫ్ ఎరికా షీల్డ్స్ రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు.

click me!