తొమ్మిదేళ్ల బాలికపై 1959లో హత్యాచారం.. 62యేళ్ల తరువాత డీఎన్ఏ టెస్టుతో తీర్పు.. కాకపోతే..

By AN TeluguFirst Published Nov 23, 2021, 4:59 PM IST
Highlights

అత్యాచార బాధితులు తమకు జరిగిన అన్యాయం గురించి ఫిర్యాదు చేయడానికి ఎక్కువగా ముందుకు రావడం లేదు. వచ్చినా.. కేసుల్లో సత్వర న్యాయం జరగడం లేదు. ఇక సమయం గడిచిన కొద్ది నిందితులకు శిక్ష పడే అవకాశాలు తక్కువగా ఉంటున్నాయి. కానీ అగ్రరాజ్యం అమెరికాలో మాత్రం  అదే 62యేళ్ల తర్వాత ఓ వ్యక్తిని అత్యాచారం కేసులో నేరస్తుడిగా నిర్ధారించింది కోర్టు. డీఎన్ఏ టెస్ట్ ఆధారంగా అతడిని దోషిగా తేల్చింది 

వాషింగ్టన్ :  అత్యాచారం ఆడవారి జీవితాన్ని సమూలంగా నాశనం చేసే దుర్ఘటన.  దురదృష్టం కొద్దీ బాల్యంలోనే ఇలాంటి చేదు అనుభవం ఎదురయితే.. వారు జీవితాంతం నరకయాతన అనుభవిస్తారు. ప్రస్తుత రోజుల్లో ముఖ్యంగా అమ్మాయి, అబ్బాయి అనే తేడా లేకుండా అకృత్యాల బారిన పడుతున్నారు. ఇదిలా ఉంటే నేటికి కూడా మన సమాజంలో అత్యాచార బాధితులు తమకు జరిగిన అన్యాయం గురించి ఫిర్యాదు చేయడానికి ఎక్కువగా ముందుకు రావడం లేదు.

వచ్చినా.. కేసుల్లో సత్వర న్యాయం జరగడం లేదు. ఇక సమయం గడిచిన కొద్ది నిందితులకు శిక్ష పడే అవకాశాలు తక్కువగా ఉంటున్నాయి. కానీ అగ్రరాజ్యం అమెరికాలో మాత్రం  అదే 62యేళ్ల తర్వాత ఓ వ్యక్తిని అత్యాచారం కేసులో నేరస్తుడిగా నిర్ధారించింది కోర్టు. డీఎన్ఏ టెస్ట్ ఆధారంగా అతడిని దోషిగా తేల్చింది ఆ వివరాలు…

 62 ఏళ్ల క్రితం హత్యాచారం…
 62 ఏళ్ల క్రితం 1959లో ఈ దారుణం చోటుచేసుకుంది. స్పోకనే వెస్ట్ సెంట్రల్ పరిసర ప్రాంతానికి చెందిన 9 ఏళ్ల బాలిక క్యాంప్ ఫైర్ మింట్స్ అమ్మడానికి బయటకు వెళ్లింది. ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. minor girl గురించి  గాలించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.  రెండు వారాల తర్వాత చిన్నారి dead body లభ్యమైంది.  బాలికపై దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి పేరు John Reig Hoff..  అప్పటికి అతడి పై పోలీసులకు ఎలాంటి అనుమానం కలగలేదు.

విదేశీ పర్యటన తర్వాత ప్రధానికి కరోనా పాజిటివ్.. మళ్లీ మహమ్మారి విజృంభణ!

అందుకే నిందితులపై అనుమానం రాలేదు..
కారణం ఏంటంటే జాన్ రీగ్ హాఫ్ American Army లో సైనికుడా పనిచేస్తుండేవాడు అందుకని పోలీసులు అతడిని అనుమానించే లేదు ఇక దారుణానికి ఒడిగట్టిన సమయంలో దారుణం జరిగిన స్పోకేన్ కౌంటీలోని ఫెయిర్‌చైల్డ్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు బాలికపై అత్యాచారం చేసి ఆ తర్వాత murder చేశారని తెలిపారు. నిందితుల కోసం పోలీసులు వెతక సాగారు.

పట్టించిన మరో దారుణం…
ఈ క్రమంలోనే అప్పటికే 9 ఏళ్ల చిన్నారి ఉసురు తీసిన జాన్‌ రీగ్‌.. మరో దారుణానికి ఒడిగట్టాడు. ఓ మహిళ కాళ్లు, చేతులు కట్టేసి కత్తితో పొడిచి హత్య చేశాడు.  ఈ కేసులో పోలీసులు జాన్‌ రీగ్‌ను అదుపులోకి తీసుకున్నారు.  ఆ సమయంలో అతడి వయసు 20 సంవత్సరాలు. మహిళను హత్య చేసిన కేసులో అమెరికా కోర్టు  జాన్‌ రీగ్‌కి శిక్ష విధించింది. మహిళ హత్య కేసు విచారణ సమయంలో జాన్‌ రీగ్‌ కు సంబంధించి పోలీసులు కొన్ని ఆసక్తికరమైన విషయాలు గుర్తించారు. 

బాలిక అత్యాచారానికి గురైన సమయంలో జాన్‌ రీగ్‌ ఆ ప్రాంతంలోనే విధులు నిర్వహిస్తున్నట్లు గమనించారు అయితే ఇప్పుడున్నత సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోవడంతో బాలిక హత్యాచారం కేసులో జాన్‌ రీగే నేరస్తుడని పోలీసులు నిరూపించలేక పోయారు.  అప్పట్లో ఈ కేసు ‘Mount Everest’ పేరుతో ప్రసిద్ధి చెందింది.

అత్యాధునిక డి ఎన్ ఎ పరిజ్ఞానం సహాయంతో..
ఈ సంవత్సరం ప్రారంభంలో,  టెక్సాస్లోని  DNA Lab కు బాధితురాలి శరీరం నుంచి తాను తీసుకెళ్లడానికి పోలీస్ డిపార్ట్మెంట్ కు అనుమతి లభించింది. శరీరంపై ఉన్న వీర్య నమూనాలు ముగ్గురు అనుమానితుల్లో ఒకరితో సరిపోయింది. ఆ ముగ్గురు ఎవరంటే.. జాన్‌ రీగ్‌, అతడి ఇద్దరు సోదరులు. ఇక బాలిక శరీరం మీద లభ్యమైన వీర్య నమూనాలు జాన్‌ రీగ్‌తో సరిపోలాయి. దాంతో బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన వ్యక్తి జాన్‌ రీగ్‌  అని తెలిపారు పోలీసులు. ఆ తర్వాత కేసు మూసివేశారు. అయితే ఇక్కడ ట్విస్టు ఏంటంటే ఈ విషయం వెలుగులోకి రావడానికి ముందే అంటే దాదాపు 30 ఏళ్ల క్రితమే అనగా 1971లో జాన్‌ రీగ్‌ మృతిచెందాడు.  

click me!