ఇండోనేషియా ఇంధన నిల్వ డిపోలో అగ్ని ప్రమాదం, 16 మంది మృతి..

Published : Mar 04, 2023, 08:48 AM IST
ఇండోనేషియా ఇంధన నిల్వ డిపోలో అగ్ని ప్రమాదం, 16 మంది మృతి..

సారాంశం

ఇండోనేషియా రాజధానిలో శుక్రవారం కనీసం 16 మంది మరణించారు మరియు డజన్ల కొద్దీ గాయపడ్డారు. ప్రభుత్వ ఇంధన నిల్వ డిపోలో భారీ మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది దానిని అదుపులోకి తీసుకువచ్చారు అని అధికారులు తెలిపారు. 

జకార్తా : ఇండోనేషియా రాజధానిలో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో కనీసం 16 మంది మరణించారు. డజన్ల కొద్దీ గాయపడ్డారు. ప్రభుత్వ ఇంధన నిల్వ డిపోలో భారీగా చెలరేగిన ఈ మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకువచ్చారని అధికారులు తెలిపారు. ఈ అగ్ని ప్రమాదంలో అనేక ఇళ్ళు కాలిపోయాయి. మంటలు ఒక్కసారిగా చుట్టుముట్టడంతోప్రజలు భయాందోళనలతో పారిపోయారు. ఈ కారణంగా ఉత్తర జకార్తాలో రాష్ట్ర ఇంధన సంస్థ పెర్టామినా నిర్వహిస్తున్న డిపో సమీపంలోని నివాస ప్రాంతాలను ఖాళీ చేయవలసి వచ్చింది.

ఈ అగ్నిప్రమాదంలో ఇద్దరు పిల్లలతో సహా 16 మంది మరణించారని, కనీసం 50 మంది గాయపడ్డారని జకార్తా ఫైర్ అండ్ రెస్క్యూ డిపార్ట్‌మెంట్ చెప్పారు. మంటలు చెలరేగడంతో మరణించిన, గాయపడిన వారిలో చాలామందికి తీవ్రమైన కాలిన గాయాలయ్యాయి, డిపార్ట్‌మెంట్ చీఫ్ సత్రియాడి గుణవన్ తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల తర్వాత (1300 జీఎంటీ) మంటలు చెలరేగడానికి గల కారణాలు స్పష్టంగా తెలియరాలేదు.

మంటలు ప్రారంభమైన కొన్ని గంటల తర్వాత మంటలను ఆర్పివేశామని ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ డుదుంగ్ అబ్దురాచ్‌మన్ విలేకరులతో అన్నారు. అగ్నిమాపక సిబ్బంది అగ్ని ప్రమాదాన్ని అదుపులోకి తెచ్చిన తర్వాత "శీతలీకరణ" కోసం పనిచేస్తున్నారని గుణవన్ చెప్పారు.

లోదుస్తుల మోడలింగ్ చేయకుండా మహిళలపై నిషేధం.. బ్రాలు ధరిస్తున్న పురుషులు.. ‘వారికంటే వీరే బెటర్’

మిలిటరీ చీఫ్ అబ్దురాచ్‌మన్,పెర్టమినా అగ్ని ప్రమాద కారణాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు."పెర్టమినా మంటలను నిర్వహించడం, సమీపంలోని కార్మికులు, నివాసితులను సురక్షిత ప్రదేశానికి తరలించడంపై దృష్టి పెట్టింది" అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. చమురు, గ్యాస్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నికే విద్యావతి మాట్లాడుతూ, ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా నిరోధించడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తోందన్నారు. ఈ ఘటన ద్వారా దేశంలో ఇంధన సరఫరాకు అంతరాయం కలగలేదని, సమీపంలోని అందుబాటులో ఉన్న టెర్మినల్స్ నుండి బ్యాకప్ సరఫరాల ద్వారా చేస్తున్నామని ఆమె చెప్పారు.

క్షతగాత్రుల చికిత్సకు ఇండోనేషియా ప్రభుత్వం సహకరిస్తుందని హేరు తెలిపారు. దేశంలోని ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థల మంత్రి ఎరిక్ థోహిర్ మరణించిన, గాయపడిన వారికి తన సంతాపాన్ని తెలిపారు. "అతని విషాదానికి మేమంతా విచారిస్తున్నాం" అని అతను ఒక ప్రకటనలో పేర్కొన్నాడు, సంఘటనపై పూర్తిగా దర్యాప్తు చేయాలని పెర్టమీనాకు పిలుపునిచ్చారు. టీవీలో ప్రసారమైన ఫుటేజీలో ప్రజలు అరుస్తూ.. ఇరుకైన రోడ్ల గుండా పారిపోతుండగా.. వారి వెనుక మంటలు ఆకాశాన్ని అంటడం కనిపిస్తుంది. 

అంబులెన్స్ లో మృతదేహాలను ఎక్కించి, ఆసుపత్రులకు తరలించడం.. మంటలను నియంత్రించడానికి అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునే దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. అగ్నిమాపక సిబ్బందికి డిపోలో పైపు పగిలిందని మొదట్లో నివేదికలు అందాయని, సమీపంలోని నివాస ప్రాంతాలకు చేరకుండా మంటలను అదుపు చేసేందుకు అధికారులు వెంటనే రంగంలోకి దిగారని గుణవన్ చెప్పారు.

ఉత్తర జకార్తాలోని ప్లంపాంగ్ డిపోకు 51 యూనిట్లు, 250 కంటే ఎక్కువ అగ్నిమాపక సిబ్బందిని మోహరించినట్లు జకార్తా ప్రధాన అగ్నిమాపక కేంద్రం తెలిపింది. 2009లో ఇదే డిపోలో అగ్నిప్రమాదం సంభవించి 2014లో డిపో సమీపంలోని 40 ఇళ్లకు మంటలు చెలరేగాయి కానీ ఈ రెండింటిలోనూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

2021లో పశ్చిమ జావాలోని బలోంగన్ రిఫైనరీలో భారీ మంటలు చెలరేగాయి, ఇది రాష్ట్ర చమురు సంస్థ పెర్టామినా, ఇండోనేషియాలోని అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాల్లో ఒకటి. రెండు రోజుల పాటు మంటలు చెలరేగాయి. భారీ పేలుడు తర్వాత వేలాది మందిని ఖాళీ చేయించారు.

PREV
click me!

Recommended Stories

Longest Expressway Tunnel : ప్రపంచంలోనే లాంగెస్ట్ టన్నెల్ ఎక్కడో తెలుసా?
Viral News: ఉద్యోగుల ఖాతాల్లోకి కోట్ల రూపాయలు డిపాజిట్.. నువ్వు బాస్ కాదు సామీ దేవుడివి