ఈజిప్టులో భారీ రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీకొని 16 మంది దుర్మరణం

By Mahesh KFirst Published Jan 8, 2022, 5:03 PM IST
Highlights

ఈజిప్టులో ఘోర ప్రమాదం జరిగింది. ఎల్ టోర్ నగరం సమీపంలో అత్యధిక వేగంతో ప్రయాణిస్తున్న ఓ ప్రభుత్వ రవాణ బస్సు, మరో మినీ బస్సు ఢీ కొన్నాయి. ఇందులో 16 మంది మరణించారు. సుమారు మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఎల్ టోర్‌లోని హాస్పిటల్‌కు తరలించారు. ఘటనాస్థలికి వెంటనే 13 అంబులెన్సులను పంపినట్టు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. శనివారం ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. 
 

కైరో: ఆఫ్రికా దేశం ఈజిప్టులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున మసక చీకటిలో ఇంకా పొగ మంచు ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఓ ప్రభుత్వ రవాణా బస్సు.. మరో మిని బస్సు అత్యధిక వేగంతో ప్రయాణిస్తు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో 16 మంది దుర్మరణం చెందారు. మరో 18 మంది గాయాలపాలయ్యారు. గాయపడినవారిలో విషమంగా ఉన్న వారూ ఉన్నారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది. శనివారం ఉదయం సినాయ్ పెనిన్సులా ఏరియాలో జరిగింది.

మినీ బస్సు, మరో కోచ్ బసు రెండు కైరో నుంచి షర్మ్ ఎల్ షేక్‌లో రెడ్ సీ టూరిస్టు రిసార్ట్‌కు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పూర్ విజిబిలిటీలో అత్యధిక వేగంతో ప్రయాణించిన ఆ రెండు బస్సులో ఒకదానితో ఒకటి ఢీకొట్టుకున్నాయి. కైరో నుంచి సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఎల్ టోర్ నగర సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను ఎల్ టోర్‌లోని ఓ హాస్పిటల్‌కు తరలించారు.

రోడ్స్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ నుంచి ఈ ఘటనపై సౌత్ సినాయ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌కు ఈ రిపోర్టు ఉదయమే అందింది. మార్టిర్ అహ్మద్ టన్నెల్ దగ్గర అంతర్జాతీయ రహదారిపై ఈ యాక్సిడెంట్ జరిగింది. ఇప్పటి వరకు ఈ యాక్సిడెంట్‌కు గల కారణాలు స్పష్టంగా తెలియరాలేవు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేయడానికి ఆదేశాలు జారీ చేసినట్టు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆఫీసు వెల్లడించింది. ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలుసుకోవడానికి ప్రత్యేకంగా ఒక ఆపరేటింగ్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపింది. ఘటనా స్థలికి వెంటనే 13 అంబులెన్సులను పంపించినట్టు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఎల్ టోర్‌లోని అల్ జహరా హాస్పిటల్‌కు క్షతగాత్రులను తరలించినట్టు తెలిపింది.

ఈజిప్టులో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. ఈ దేశంలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనలు అత్యధికంగా ఉన్నాయి. అలాగే, రోడ్ల పరిస్థితులూ అధ్వాన్నంగా ఉంటాయి. అందుకే ఇక్కడ యేటా భారీగా ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. అక్టోబర్‌లో రెండు వాహనాలు ఢీకొన్నాయి. దేశ రాజధాని కైరో సమీపంలో చోటుచేసుకున్న ఆ ప్రమాదంలో 19 మంది మరణించారు. సూయజ్, కైరో మధ్యలో రహదారిపై సెప్టెంబర్‌లో ఓ బస్సు పూర్తిగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించగా, మరో 30 మంది గాయపడ్డారు. 

ఆ దేశ అధికారిక సమాచారం ప్రకారం, ఈజిప్టులో 2019లో సుమారు పది వేల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 3,400 మంది మరణించారు. కాగా, 2018లో 8,480 కారు యాక్సిడెంట్లు జరిగాయి. సుమారు 3080 మంది ఈ ప్రమాదాల్లో మరణించారు.

bangaloreలో శుక్రవారం రాత్రి ఘోర road accident జరిగింది. ట్రక్కు, కారు ఢీకొన్న ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా నలుగురు techies మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ట్రక్ డ్రైవర్ over speed, నిర్లక్ష్యంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వారు తెలిపారు.

"బెంగళూరులోని పూర్వాంకర అపార్ట్‌మెంట్ సమీపంలోని నైస్ రోడ్డులో ఒక పెద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ ట్రక్కు అనేక వాహనాలను ఢీకొట్టింది" అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్ వెస్ట్ కుల్దీప్ జైన్ తెలిపారు.

click me!