కాలువలో పడ్డ బస్సు.. 16 మంది మృతి, 30 మందికి తీవ్ర గాయాలు

Published : Mar 19, 2023, 12:41 PM IST
కాలువలో పడ్డ బస్సు.. 16 మంది మృతి, 30 మందికి తీవ్ర గాయాలు

సారాంశం

బంగ్లాదేశ్‌లోని మదారిపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శిబ్‌చార్ ఉపజిల్లాలోని కుతుబ్‌పూర్ ప్రాంతంలో బస్సు కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 16 మంది మరణించగా.. 30 మంది గాయపడ్డారు.

బంగ్లాదేశ్‌లోని మదారిపూర్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో 16 మంది మృతి చెందగా, 30 మంది గాయపడ్డారు. ఈ ఘటన మదారిపూర్‌లోని శిబ్‌చార్ ఉపజిల్లాలోని కుతుబ్‌పూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ప్యాసింజర్ బస్సు పద్మా బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు నుంచి ఢాకా వెళుతోంది. ఉదయం 7.30 గంటలకు మదరిపూర్‌లోని ఎక్స్‌ప్రెస్‌వేపై ఎమాద్ పరిభాన్ నడుపుతున్న ఢాకాకు వెళ్లే బస్సు అదుపు తప్పి పడిపోయిందని పోలీసులు తెలిపారు. 

అగ్నిమాపక సిబ్బంది , పోలీసులు, స్థానిక ప్రజలతో కలిసి రెస్క్యూ , రిలీఫ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని షిబ్‌చార్ హైవే పోలీస్ స్టేషన్‌కు చెందిన ఓసి అబూ నయీమ్ ఎండి మోఫాజెల్ హక్ తెలిపారు. క్షతగాత్రులను వారి గాయాల తీవ్రతను బట్టి ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రులను వారి గాయాల తీవ్రతను బట్టి ఆసుపత్రులకు తరలించారు. బస్సు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడనీ, దీంతో బస్సు అదుపు తప్పి లోయలో పడిందని పలు నివేదికలు పేర్కొన్నాయి. గాయపడిన ప్రయాణికులను వివిధ ఆసుపత్రులకు తరలించినట్లు మదరిపూర్ పోలీస్ సూపరింటెండెంట్ మహ్మద్ మసూద్ ఆలం తెలిపారు. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు.
 

PREV
click me!

Recommended Stories

Nepal Floods: చుట్టూ సర్వనాశనం.. ఆ పచ్చని ఇల్లు మాత్రం ఎలా నిలబడింది? నేపాల్ వరదల్లో మిరాకిల్!
Nepal Flash Floods: నేపాల్‌లో ఘోర ప్రళయం.. 903కు పెరిగిన మృతుల సంఖ్య, 4,200 మందికి పైగా గల్లంతు