మెక్సికోలో కూలిన బ్లాక్ హాక్ మిలిటరీ ఛాపర్.. 14 మంది మృతి..

Published : Jul 16, 2022, 09:13 AM IST
మెక్సికోలో కూలిన బ్లాక్ హాక్ మిలిటరీ ఛాపర్.. 14 మంది మృతి..

సారాంశం

సినాలోవాలో మెక్సికన్ నేవీ హెలికాప్టర్ కూలిపోవడంతో శుక్రవారం మొత్తం 14 మంది మరణించారని నేవీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

మెక్సికో : ఉత్తర రాష్ట్రమైన సినాలోవాలో బ్లాక్ హాక్ మిలిటరీ హెలికాప్టర్ కూలిపోయిన ఘటనలో 14 మంది మరణించారని, మరొకరు గాయపడ్డారని మెక్సికో నేవీ శుక్రవారం తెలిపింది. హెలికాప్టర్ క్రాష్ కు గల కారణాల కోసం దర్యాప్తు చేస్తున్నారు. అయితే, శుక్రవారం సినాలోవాలో డ్రగ్ లార్డ్ రాఫెల్ కారో క్వింటెరో అరెస్టుకు దీనికి  సంబంధం ఉందన్న సమాచారం ఏమీ లేదని నేవీ ఒక ప్రకటనలో తెలిపింది.

1985లో US యాంటీ-నార్కోటిక్ ఏజెంట్‌ను చిత్ర హింసలకు గురిచేసి, హత్య చేసిన కేసులో దోషిగా తేలిన పేరుమోసిన డ్రగ్ లార్డ్ రాఫెల్ కారో క్వింటెరోను శుక్రవారం నావికాదళం పట్టుకుంది. కింగ్‌పిన్ 1980లలో లాటిన్ అమెరికాలో అత్యంత శక్తివంతమైన మాదకద్రవ్యాల అక్రమ రవాణా సంస్థలలో ఒకటైన గ్వాడలజారా కార్టెల్ సహ-వ్యవస్థాపకుడిగా ప్రాముఖ్యతను సంతరించుకున్నాడు. US అధికారులకు అత్యంత విలువైన లక్ష్యాలలో ఒకడిగా ఉన్నాడు.

అతని అరెస్టును US ప్రభుత్వం ప్రశంసించింది. అతడిని వెంటనే అప్పగించమని... అతడిని అప్పగించడం విషయంలో అభ్యర్ణనలు కోరుతూ సమయాన్ని వృథా చేయదని పేర్కొంది. "ఇది చాలా పెద్దవిషయం" అని వైట్ హౌస్ సీనియర్ లాటిన్ అమెరికా సలహాదారు జువాన్ గొంజాలెజ్ ట్విట్టర్‌లో తెలిపారు. మెక్సికో మాదకద్రవ్యాల రవాణా కేంద్రాలలో ఒకటైన వాయువ్య రాష్ట్రమైన సినాలోవాలోని చోయిక్స్ మునిసిపాలిటీలో కారో క్వింటెరో పట్టుబడ్డారని మెక్సికన్ నేవీ ఒక ప్రకటనలో తెలిపింది.

బ్రిటన్ పీఎంగా రిషి సునాక్‌కు మద్దతు ఇవ్వొద్దు.. బోరిస్ జాన్సన్ రహస్య ప్రచారం

అతను మాక్స్ అనే మిలిటరీ-శిక్షణ పొందిన ఫీమేల్ బ్లడ్‌హౌండ్ కి పట్టుబడ్డాడని నేవీ తెలిపింది. మెక్సికన్ అధికారుల ప్రకారం, శాన్ సైమన్, చోయిక్స్‌లో అరెస్టు యునైటెడ్ స్టేట్స్ నుండి ఒత్తిడి తర్వాత వచ్చింది. అదే వారంలో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్ US అధ్యక్షుడు జో బిడెన్‌తో వాషింగ్టన్‌లో సమావేశమయ్యారు.

కారో క్వింటెరో మాజీ US డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ ఏజెంట్ ఎన్రిక్ "కికి" కమరేనాను క్రూరంగా హత్య చేసినందుకు 28 సంవత్సరాలు జైలులో గడిపాడు, ఇది మెక్సికో నార్కో యుద్ధాలలో అత్యంత అపఖ్యాతి పాలైన హత్యలలో ఒకటి. 2018 నెట్‌ఫ్లిక్స్ సిరీస్ "నార్కోస్: మెక్సికో"లో నాటకీయంగా ప్రదర్శించబడిన సంఘటనలు ఐదు దశాబ్దాల "డ్రగ్స్‌పై యుద్ధం"లో US-మెక్సికో సహకారానికి దారితీసింది.

కారో క్వింటెరో గతంలో కమరేనా హత్యలో తన ప్రమేయాన్ని ఖండించారు. 2013లో విడుదల అయ్యాడు. ఆ తరువాత అండర్ గ్రౌండ్ కి వెళ్లి.. వెంటనే సినాలోవా కార్టెల్‌లో అక్రమ రవాణాకు తిరిగి వచ్చాడు, U.S. అధికారుల ప్రకారం, అతన్ని FBI  టాప్ 10 మోస్ట్ వాంటెడ్ ఫ్యుజిటివ్‌ల జాబితాలో ఉన్నాడు. అతని తలమీద 20 మిలియన్ల యూఎస్ డాలర్ల బహుమతిని విధించారు. ఇది డ్రగ్ ట్రాఫికర్‌గా రికార్డు.
 

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !