
అమెరికా : అమెరికాలోని అరిజోనాలో ఓ విషాద ఘటన వెలుగు చూసింది. తల్లి కారు కింద పడి 13నెలల చిన్నారి మృత్యువాత పడింది. కారు స్టార్ చేయగా ప్రమాదవశాత్తు అది దూసుకుపోవడంతో చిన్నారి మరణించిందని.. ఎన్‌బిసి న్యూస్ తెలిపింది. ఈ విషాదకర సంఘటన గత గురువారం వారి ఫ్యామిలీకి చెందిన కాటన్‌వుడ్ ఇంటి సమీపంలో జరిగింది.
జూలై 6న, కౌంటీ షెరీఫ్ కార్యాలయానికి ఒక మహిళ నుండి కాల్ వచ్చింది, ''ఆమె తన 13 నెలల చిన్నారి పైకి కారు తోలినట్టుగా తెలిపింది'' అని పేర్కొంది. దీని ప్రకారం జాఫ్రియా థోర్న్‌బర్గ్ అనే మహిళ తమ ఇంటి బయట ఉన్న కంకర ప్రదేశంలో కారును పార్క్ చేసింది.
బరువెక్కువయ్యిందని 19మంది ప్రయాణికులను వదిలేసి.. టేకాఫ్ అయిన విమానం..
ఆ ప్రాంతం చాలా ఇరుకుగా ఉంది. కారును అక్కడినుంచి తీయడానికి ఆమె ప్రయత్నించే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. కారును తీసేముందు ఆమె తన కూతురిని సురక్షితమైన దూరంలో ఉంచినట్లుగా తెలిపింది. కారును తీస్తున్న సమయంలో కారు బానెట్ ఓ చెట్టుకు ఇరుక్కుపోయింది. దీంతో కాస్త గట్టిగా తీసేసరికి కారు వేగంగా వెనక్కి వచ్చి చిన్నారి మీదినుంచి దూసుకెళ్లింది. దీంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చింది.
సమాచారంతో అక్కడికి చేరుకున్న వైసీఎస్ఓ వైద్య సిబ్బంది చిన్నారికి కాపాడడానికి వెంటనే చికిత్స ప్రారంభించింది. కానీ వారి ప్రయత్నాలు ఫలింతచలేదు. వెర్డే వ్యాలీ మెడికల్ సెంటర్‌లో చిన్నారి మరణించినట్లు ప్రకటించారు ”అని తెలిపారు. వైసీఎస్ఓ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ బ్యూరో ఇప్పుడు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తోంది. ప్రస్తుతానికి, తన కుమార్తె మరణానికి సంబంధించి తల్లిపై అభియోగాలు మోపబడతాయో లేదో తెలియదు. మృతి చెందిన బాలికను 13 నెలల సైరా రోజ్ థోమింగ్‌గా గుర్తించారు. బాలిక కోసం గో ఫండ్ మీని ఏర్పాటు చేశారు.