ఇప్పటివరకు అమెరికా నుండి బహిష్కరించబడిన భారతీయులు ఎంతమందంటే...

Arun Kumar P   | ANI
Published : May 29, 2025, 06:46 PM IST
Ministry of External Affairs spokesperson Randhir Jaiswal (Photo/MEA, YouTube)

సారాంశం

జనవరి 2025 నుండి దాదాపు 1080 మంది భారతీయులను అమెరికా నిషేధించిందని… వీరిలో 62% మంది వాణిజ్య విమానాల ద్వారా తిరిగి వచ్చారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా అమెరికాలో అక్రమంగా నివాసముంటున్నవారిపై ట్రంప్ చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. వీరిని గుర్తించి సంకెళ్లతో బంధించి మరి ఆర్మీ విమానాల్లో వారివారి దేశాలకు తరలిస్తున్నారు. ఇలా ఇండియన్స్ ను కూడా తరలించారు. 

అయితే భారత్ విషయంలో అమెరికా అంత కఠినంగా ఏమి వ్యవహరించడంలేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అంటే జనవరి 2025 నుండి దాదాపు 1080 మంది భారతీయులను అమెరికా నుండి బహిష్కరించారని తెలిపారు.  వీరిలో 62% మంది వాణిజ్య విమానాల ద్వారా తిరిగి దేశానికి వచ్చారని విదేశాంగ శాఖ తెలిపింది.

గురువారం MEA అధికార ప్రతినిధి రాంధీర్ జైస్వాల్ మాట్లాడుతూ…"అక్రమంగా నివాసముంటున్న లేదా అక్రమంగా ప్రయాణించే భారతీయ పౌరుల బహిష్కరణ విషయంలో అమెరికాతో టచ్ లో ఉన్నా. ఇలా ఉన్నవారి వివరాలు అందిన తర్వాత మేమే వారిని తిరిగి భారత్ కు తీసుకువస్తాము. జనవరి 2025 నుండి ఇప్పటివరకు దాదాపు 1080 మంది భారతీయులు అమెరికా నుండి బహిష్కరించబడ్డారు. వీరిలో 62% మంది వాణిజ్య విమానాల ద్వారా వచ్చారు" అని ఆయన తెలిపారు.

విద్యార్థి, ఎక్స్ఛేంజ్ వీసా దరఖాస్తుదారులకు సంబంధించి అమెరికా ప్రభుత్వ నూతన మార్గదర్శకాలను సూచించే నివేదికలను ఇండియా చూసిందని జైస్వాల్ తెలిపారు. విదేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థుల సంక్షేమం భారత ప్రభుత్వానికి అత్యంత ప్రధానమైనది ఆయన అన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే