పిల్లోడి వయసు ఏడాది.. నెలకు రూ. 75 వేల ఆదాయం.. అతడు ఏం చేస్తున్నాడంటే..

By team teluguFirst Published Oct 22, 2021, 9:29 AM IST
Highlights

సోషల్ మీడియా  ఇన్‌ఫ్లుయెన్సర్‌‌గా (Social media influencers) మారిన  పలువరు  భారీగా ఆదాయాన్ని సొంతం  చేసుకుంటున్నారు. తాజాగా ఆ జాబితాను  ఓ ఏడాది  చిన్నారి  చేరాడు. ఈ చిన్నారికి నెలకు రూ. 75 వేల వరకు  ఆదాయం వస్తుంది. 

సోషల్ మీడియాలో చాలా మంది సెలబ్రిటీలు ఓవర్ నైట్‌లో స్టార్‌లుగా  మారిపోతున్నారు. వారికంటూ ప్రత్యేక  గుర్తింపును తెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియా  ఇన్‌ఫ్లుయెన్సర్‌‌గా (Social media influencers) మారిన  పలువరు  భారీగా ఆదాయాన్ని సొంతం  చేసుకుంటున్నారు. తాజాగా ఆ జాబితాను  ఓ ఏడాది  చిన్నారి  చేరాడు. ఈ చిన్నారికి నెలకు రూ. 75 వేల వరకు  ఆదాయం వస్తుంది. ఇంతకీ ఆ చిన్నారి ఏం చేస్తుందని అనుకుంటున్నారా..  పలు ప్రాంతాల్లో  పర్యటించడమే. అమెరికాకు చెందిన  బేబీ బ్రిగ్స్ ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా నెలకు  1,000 డాలర్లు (రూ.75 వేల) సంపాదించాడు. ఇప్పటివరకు 45 సార్లు విమాన  ప్రయాణం  చేశాడు. అమెరికాలోని 16 రాష్ట్రాలను సందర్శించాడు. గత ఏడాది అక్టోబర్  14 న జన్మించిన  బ్రిగ్స్..  కేవలం మూడు వారాల వయసులోనే తన మొదటి టూర్‌లో ఉన్నట్టు అతడి తల్లి  జెస్  తెలిపింది. 

ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో బ్రిగ్స్‌కు (Briggs) 30,000 మంది ఫాలోవర్స్  ఉన్నారు. అతని తల్లి  పార్ట్  టైమ్ టూరిస్ట్స్ అనే పేరుతో  బ్లాగ్ కూడా రన్ చేస్తుంది. ‘అయితే  2020లో  నేను  గర్భం దాల్చినప్పుడు  నా కెరీర్ ముగిసిందని  నిజంగా భయపడ్డాను. ఎందుకంటే  శిశువుతో ట్రావెలింగ్ సాధ్యమేనా  అని  అనిపించింది. అయితే నా భర్త, నేను నిజంగా ఈ పని చేయాలనుకున్నాము. నేను బేబీ ట్రావెల్ గురించిన సోషల్ మీడియా అకౌంట్‌ల కోసం వెతకడం మొదలుపెట్టాను. నాకు ఒక్కటి కూడా దొరకలేదు. అందుకు సంబంధించిన వివరాలు లేకపోవడంతో.. అక్కడ  ఖాళీని  చూశాను.  ఈ  క్రమంలోనే నేు  నేర్చుకున్న ప్రతిదాన్ని సరదాగా  పంచుకునేందుకు సోషల్  మీడియా ఖాతాలను  ఏర్పాటు  చేయాలని  అనుకున్నాను.  శిశువుతో ప్రయాణం  చేసేటప్పుడు మంచి, చెడుల గురించి చెప్పాను. ఇది తొలిసారిగా శిశువుతో ప్రయాణించే  తల్లిదండ్రులకు  సహాయం చేయడం’అని  జెస్  అన్నారు. 

ఈ కుటుంబం కోవిడ్-19 లాక్‌డౌన్ నిబంధనలను అనుసరించి ప్రయాణాలు  సాగించింది.  అన్ని కరోనా సంబంధిత ప్రోటాకల్‌ను అనుసరించింది. సామాజిక దూరం పాటించడం, పర్యటించే ప్రాంతాల్లో నిబంధనలు, అక్కడ సెలవులపై ద‌ృష్టి సారించింది. ఇక, బ్రిగ్స్‌కు స్పాన్సర్ కూడా ఉన్నారు. వారు ఉచిత డైపర్‌లు, వైప్‌లు అందిస్తారు. అయితే  రాబోయే ఆరు నెలల్లో లండన్‌తో సహా యూరప్ పర్యటనకు బ్రిగ్స్ కుటుంబం ప్లాన్ చేస్తోంది.

click me!