రాయుడూ నిర్ణయం వెనక్కి తీసుకో.. యువరాజ్ తండ్రి సూచన

By telugu teamFirst Published Jul 10, 2019, 12:11 PM IST
Highlights

ఇండియన్ క్రికెటర్ అంబటి రాయుడు ఇటీవల క్రికెట్ కి వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. కాగా... రిటైర్మెంట్ విషయంలో అంబటి రాయుడు తన నిర్ణయం వెనక్కి తీసుకోవాలని మరో క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సూచించారు.

ఇండియన్ క్రికెటర్ అంబటి రాయుడు ఇటీవల క్రికెట్ కి వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. కాగా... రిటైర్మెంట్ విషయంలో అంబటి రాయుడు తన నిర్ణయం వెనక్కి తీసుకోవాలని మరో క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సూచించారు. ప్రపంచకప్ లో సెలక్టర్లు తనను స్టాండ్ బై క్రికెటర్ గా ఎంపిక చేసినా... అవసరమైన సమయంలో తనని తీసుకోకపోవడం పట్ల అంబటి మనస్థాపానికి గురయ్యాడు. అందుకే అన్ని ఫార్మాట్ల క్రికెట్ కి వీడ్కోలు పలికాడు. కాగా... ఈ విషయంలో రాయుడికి యూవీ తండ్రి పలు సూచలను చేశాడు.

రాయుడు కచ్చితంగా టీం ఇండియాలో ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. రాయుడు ఇంకా ఎన్నో మ్యాచులు ఆడాలని కోరుకున్నారు. రంజీ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ, దులీప్‌ ట్రోఫీ, ఎన్నో ఆడాలని చెప్పారు. ఇంకా ఎన్నో వేల పరగులు చేయాల్సి ఉందని చెప్పారు. క్రికెట్ రాయుడిని బాగా మిస్సవుతుందని ఆయన అన్నారు. అంబటి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని.. తానెంటో నిరూపించుకోవాలని సూచించారు.

ప్రపంచకప్‌ టీమిండియా జట్టులో స్టాండ్‌బై ఆటగాడిగా రాయుడు ఉన్న విషయం తెలిసిందే. ధావన్‌ గాయపడి టోర్నీకి దూరమైనప్పుడు ఆ స్థానంలో రిషబ్‌ పంత్‌కు పిలుపు అందింది. అప్పుడు రాయుడుకు అవకాశం రాలేదు. విజయ్‌ శంకర్‌కు గాయమై టోర్నీ నుంచి నిష్క్రమించినప్పటికీ రాయుడుకు పిలుపు అందలేదు. దీంతో మనస్తాపం చెందిన రాయుడు..క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

click me!