భారత్-న్యూజిలాండ్ సెమీఫైనల్... నేడూ వరుణ గండమే

By telugu teamFirst Published Jul 10, 2019, 11:51 AM IST
Highlights

ప్రపంచకప్ 2019 చివరి అంకానికి చేరకుంది. ఇప్పటికే నాలుగు జట్లు సెమీ ఫైనల్స్ కి చేరుకున్నాయి. వాస్తవానికి నిన్నటికే ఒక జట్టు ఫైనల్స్ కి చేరి మరో జట్టు ఇంటికి చేరాల్సి ఉంది. 

ప్రపంచకప్ 2019 చివరి అంకానికి చేరకుంది. ఇప్పటికే నాలుగు జట్లు సెమీ ఫైనల్స్ కి చేరుకున్నాయి. వాస్తవానికి నిన్నటికే ఒక జట్టు ఫైనల్స్ కి చేరి మరో జట్టు ఇంటికి చేరాల్సి ఉంది. అయితే ఈ విషయం ఏటు తేలకుండా వర్షం అడ్డుకుంది. దీంతో... మ్యాచ్ నేటికి వాయిదా పడింది. అయితే.. ఈ రోజు కూడా వర్షం పడే అవకాశం ఉందని వాతవరణ శాఖ చెబుతోంది.

అసలు ప్రపంచకప్ లో భారత్- న్యూజిలాండ్ జట్లు ఆడటం వరుణుడికి ఇష్టం లేనట్లుగా అనిపిస్తోంది. గతంలో ఈ రెండు జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా వర్షం కారణంగా ఆగిపోయింది. తాజాగా సెమీఫైనల్స్ కి కూడా ఇదే విధంగా తయారయ్యింది. అదృష్ట‌వ‌శాత్తూ రిజ‌ర్వ్ డే ఉండ‌డంతో మంగ‌ళ‌వారం మ్యాచ్ ఎక్క‌డైతే ఆగిందో బుధ‌వారం అక్కణ్నుంచే ప్రారంభ‌మ‌వుతుంది. అయితే బుధ‌వారం కూడా ఈ మ్యాచ్‌ను వ‌రుణుడు స‌జావుగా సాగ‌నిచ్చేలా లేడు.
 
బుధ‌వారం కూడా మాంచెస్ట‌ర్‌లో భారీ వ‌ర్షం కురుస్తుంద‌ని వాతావార‌ణ శాఖ వెల్ల‌డించింది. ఏక‌ధాటిగా కాక‌పోయినా మ్యాచ్‌కు వ‌ర్షం ప‌లుసార్లు అంత‌రాయం క‌లిగిస్తుంద‌ట‌. రోజంతా ఆకాశం మేఘావృత‌మై ఉంటుంద‌ని, మధ్యాహ్నం 12 గంట‌ల‌కు (భార‌త కాల‌మానం ప్ర‌కారం మ‌ధ్యాహ్నం 4:30 గంట‌ల‌కు), సాయంత్రం 5 గంట‌ల (భార‌త కాల‌మానం ప్ర‌కారం రాత్రి 9:30 గంట‌ల‌కు) స‌మ‌యంలో భారీ వ‌ర్షం కురుస్తుంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అంచ‌నా వేసింది. ఇప్పటికైతే వర్షం లేదు కానీ..  మ్యాచ్ సమయంలో పడితే మాత్రం ఎవ్వరూ ఏం చెయ్యలేరు.

click me!