ఆ మ్యాచ్ గురించి మర్చిపో... సర్ఫరాజ్ కి పీసీబీ సూచన

By telugu teamFirst Published Jun 19, 2019, 2:01 PM IST
Highlights

ఇటీవల భారత్ తో జరిగిన మ్యాచ్ గురించి మర్చిపోవాలని పాకిస్థాన్ టీం కెప్టెన్ సర్ఫరాజ్ కి ఆ దేశ క్రికెట్ బోర్డ్( పీసీబీ) ఛైర్మన్ ఎహ్‌సాన్‌ మణి  సూచించారు. 

ఇటీవల భారత్ తో జరిగిన మ్యాచ్ గురించి మర్చిపోవాలని పాకిస్థాన్ టీం కెప్టెన్ సర్ఫరాజ్ కి ఆ దేశ క్రికెట్ బోర్డ్( పీసీబీ) ఛైర్మన్ ఎహ్‌సాన్‌ మణి  సూచించారు. భారత్ జరిగిన మ్యాచ్ లో పాక్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ టీం పై విమర్శల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా కెప్టెన్ సర్ఫరాజ్ పై నెటిజన్లు మండిపడుతున్నారు.

ఈ క్రమంలో పీసీబీ.. కెప్టెన్ సర్ఫరాజ్ లో ధైర్యం పెంచే ప్రయత్నం చేశారు. ‘దేశమంతా మీకు అండగా ఉంది. రాబోయే రోజుల్లో కలసికట్టుగా మెరుగైన ప్రదర్శనను ఇస్తారని ఆశిస్తున్నాం’ అని సర్ఫరాజ్‌ అహ్మద్‌తో ఎహ్‌సాన్‌ మణి ఫోన్‌లో మాట్లాడినట్లు పాక్ మీడియా తెలిపింది.

సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తకథనాలను పట్టించుకోకుండా రానున్న మ్యాచ్‌ల్లో  కెప్టెన్‌గా జట్టును ముందుకు నడిపించాలని చైర్మన్‌ ఎహ్సాన్‌ మణి సర్ఫరాజ్‌ అహ్మద్‌ను కోరినట్లు న్యూస్‌ ఎక్స్‌ తన కథనంలో వివరించింది. ఇప్పటివరకు పాక్ 5 మ్యాచ్ లు ఆడగా... 3 పాయింట్లతో  9వ స్థానంలో ఉంది. 

click me!