బుర్ర లేదు..పాక్ కెప్టెన్ పై అక్తర్ ఘాటు వ్యాఖ్యలు

By telugu teamFirst Published Jun 17, 2019, 2:16 PM IST
Highlights

తమ చిరకాల ప్రత్యర్థి పాక్ పై టీం ఇండియా సునాయాసంగా గెలిచింది. ఈ మ్యాచ్ భారతీయ అభిమానుల్లో ఆనందాన్ని నింపితే... పాక్ అభిమానుల్లో మాత్రం నిరాశే మిగిలింది. 

తమ చిరకాల ప్రత్యర్థి పాక్ పై టీం ఇండియా సునాయాసంగా గెలిచింది. ఈ మ్యాచ్ భారతీయ అభిమానుల్లో ఆనందాన్ని నింపితే... పాక్ అభిమానుల్లో మాత్రం నిరాశే మిగిలింది. ఈ మ్యాచ్ ఓడిపోవడానికి కెప్టెన్ సర్ఫరాజ్ తీసుకున్న నిర్ణయమే కారణమని ఆ జట్టు సభ్యుడు షోయబ్ అక్తర్ అభిప్రాయపడ్డారు. సర్ఫరాజ్ కి అసలు బుర్రేలేదు అంటూ... ఘాటువ్యాఖ్యలు చేశారు.

‘చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో భారత జట్టు చేసిన తప్పునే నిన్న పాకిస్తాన్‌ జట్టు చేసింది. సర్ఫరాజ్‌ ఇంత తెలివి తక్కువ పనిచేస్తాడని నేను అసలు ఊహించలేదు. పాక్‌ చేజింగ్‌ చేయలేదనే విషయాన్ని, తమ బలం, ఏ రకమైన బౌలింగ్‌ ముఖ్యమనే విషయాలను మర్చిపోయాడు. పాకిస్తాన్‌ టాస్‌ గెలవగానే సగం మ్యాచ్‌ గెలిచాం అనుకున్నాం. కానీ సర్ఫరాజ్‌ చేజేతులా మ్యాచ్‌ను చేజార్చాడు. టాస్‌ చాలా కీలకం. పాకిస్తాన్‌ 260 పరుగులు చేసినా.. తమకున్న బౌలింగ్‌ వనరులతో కాపాడుకునేది. నిజంగా సర్ఫరాజ్‌ది బ్రెయిన్‌లెస్‌ కెప్టెన్సీ. కెప్టెన్‌గా అతను చేసిన పనిని ఏ మాత్రం సహించలేకపోతున్నాం. ఈ ఓటమి తీవ్ర బాధను మిగిల్చింది. అతనిలో ఇమ్రాన్‌ ఖాన్‌ షేడ్స్‌ చూడాలనుకున్నాను కానీ అతను మాత్రం బుద్దిలేని పనులకు పాల్పడుతున్నాడు.’ అని ఘాటుగా వ్యాఖ్యానించాడు.

click me!