పాక్‌పై భారత్ గెలుపు: మరో సర్జికల్ స్ట్రైక్ అన్న అమిత్ షా

Siva Kodati |  
Published : Jun 17, 2019, 01:16 PM IST
పాక్‌పై భారత్ గెలుపు: మరో సర్జికల్ స్ట్రైక్ అన్న అమిత్ షా

సారాంశం

ప్రపంచకప్‌లలో పాకిస్తాన్‌పై జైత్రయాత్ర కొనసాగించిన భారత్.. ఆదివారం రాత్రి మరోసారి దాయాది జట్టుపై గెలుపొందడంతో టీమిండియా అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు

ప్రపంచకప్‌లలో పాకిస్తాన్‌పై జైత్రయాత్ర కొనసాగించిన భారత్.. ఆదివారం రాత్రి మరోసారి దాయాది జట్టుపై గెలుపొందడంతో టీమిండియా అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు.

ఈ విజయంతో రాజకీయ, సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్రమంత్రి అమిత్ షా సైతం భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు.

‘‘పాక్‌పై మరో సర్జికల్ స్ట్రైక్‌గా ఆయన ఈ విజయాన్ని అభివర్ణించారు. అద్బుత ప్రదర్శన కనబర్చిన జట్టుకు అభినందనలు.. ఈ అద్భుత విజయం పట్ల ప్రతీ భారతీయుడు గర్వపడుతున్నాడు. సంబరాలు చేసుకుంటూ గెలుపును ఆస్వాదిస్తున్నాడంటూ అమిత్ షా ట్వీట్ చేశారు.

ఆయనతో పాటు  కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, రాజ్‌నాథ్‌ సింగ్‌, కిరణ్‌ రిజిజు, పియూష్‌ గోయల్ తదితరులు టీమిండియాను అభినందించారు. 

PREV
click me!

Recommended Stories

కప్ పోయిందన్న బాధ ముఖంపై లేదు: విలియమ్సన్‌పై సచిన్ ప్రశంస
ప్రపంచకప్ హీరోలకు ర్యాంకుల పంట, టాప్ ప్లేస్‌ కోహ్లీదే..!!