ఫైనల్‌లో గప్టిల్ రనౌట్: ధోనిని ఔట్ చేసిన కర్మ ఫలమేనా.. ఫ్యాన్స్ ట్రోలింగ్

By Siva KodatiFirst Published Jul 15, 2019, 12:20 PM IST
Highlights

రన్‌ కోసం ప్రయత్నించిన ధోని... గప్టిల్ వేసిన అద్భుతమైన త్రోకు రనౌట్ అవ్వడంతో 130 కోట్ల మంది భారతీయుల కల చెదిరిపోయింది. దీంతో టీమిండియా ఫ్యాన్స్ గప్టిల్‌ను విమర్శిస్తూ.. సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. 

మూడు రోజుల కిందట భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీఫైనల్‌లో లక్ష్యఛేదనలో ఉన్న టీమిండియా మ్యాచ్‌పై ఆశలు వదులుకున్న వేళ.. ధోని ఒంటరి పోరాటంపై ఆశలు పెట్టుకుంది.

అయితే సెకండ్ రన్‌ కోసం ప్రయత్నించిన ధోని... గప్టిల్ వేసిన అద్భుతమైన త్రోకు రనౌట్ అవ్వడంతో 130 కోట్ల మంది భారతీయుల కల చెదిరిపోయింది. దీంతో టీమిండియా ఫ్యాన్స్ గప్టిల్‌ను విమర్శిస్తూ.. సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు.

అయితే ప్రపంచకప్‌ ఫైనల్‌లో గప్టిల్‌కు ధోనికి ఎదురైన అనుభవమే పునరావృతమైంది. ఫైనల్ మ్యాచ్ సూపర్‌ఓవర్‌ చివరి బంతికి రెండో పరుగు తీయబోయిన గప్టిల్ రనౌట్‌ కావడంతో ప్రపంచకప్ ఇంగ్లాండ్ వశమైంది.

ఆర్చర్ వేసిన సూపర్ ఓవర్ చివరి బంతిని బలంగా బాదిన మార్టిన్ గప్టిల్ మొదటి పరుగును సురక్షితంగా పూర్తి చేయగా.... రెండో పరుగు కోసం గప్టిల్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఫీల్డర్‌ నుంచి బంతిని అందుకున్న కీపర్ బట్లర్ రెప్పపాటులో వికెట్లను గిరాటేశాడు.

దీంతో మ్యాచ్ టై అవ్వడం.. అత్యధిక బౌండరీలు బాదిన ఇంగ్లాండ్‌ను విశ్వవిజేతగా ప్రకటించడం జరిగిపోయాయి. అంతేకాదు సూపర్‌ఓవర్‌లో గప్టిల్ విసిరిన బంతి స్టోక్స్ బ్యాట్‌కు తగిలి బౌండరీకి దూసుకుపోవడంతో ఇంగ్లాండ్‌కు అదనంగా నాలుగు పరుగులు రావడం మ్యాచ్‌ను మలుపుతిప్పింది.

ధోనిని రనౌట్ చేసి భారత ఆశలను సమాధి చేసినందుకు గప్టిల్‌కు తగిన శాస్తి జరిగిందంటూ టీమిండియా అభిమానులు ఈ సంఘటనను ట్రోల్ చేస్తున్నారు. 

click me!