టీం ఇండియా విజయాలకు బ్రేక్ వేస్తాం.. విండీస్

Published : Jun 27, 2019, 12:27 PM IST
టీం ఇండియా విజయాలకు బ్రేక్ వేస్తాం.. విండీస్

సారాంశం

ప్రపంచకప్ లో టీం ఇండియా వరస విజయాలతో దూసుకుపోతోంది. అయితే... ఈ మ్యాచ్ లో టీం ఇండియాపై గెలిచి సెమిస్ ఆశలను నిలుపుకోవాలని విండీస్ పట్టుదలతో ఉంది. 


ప్రపంచకప్ లో టీం ఇండియా వరస విజయాలతో దూసుకుపోతోంది. అయితే... ఈ మ్యాచ్ లో టీం ఇండియాపై గెలిచి సెమిస్ ఆశలను నిలుపుకోవాలని విండీస్ పట్టుదలతో ఉంది. టీం ఇండియాకి గట్టి పోటీ ఇవ్వాలని ఈ సందర్భంగా విండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ తమ జట్టు సభ్యులకు సూచించాడు.

ఈ సందర్భంగా జేసన్ హోల్డర్ మీడియాతో మాట్లాడారు.  తమ జట్టులో అందరూ సమష్టిగా ఇప్పటివరకు ఆడలేదన్నారు. ఒకరు ఆడితే... మరొకరు విఫలమౌతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే గతంలో కొన్ని మ్యాచ్ లు ఓడిపోయామని అభిప్రాయపడ్డారు.

అందుకే నేడు టీం ఇండియాతో జరగనున్న మ్యాచ్ లో ఎలాగైనా అందరం కలిసి కట్టుగా ఆడి విజయం సాధించాలనుకుంటున్నట్లు చెప్పాడు. ఆటగాళ్లను గాయాలు వేధించడం చాలా సహజమని చెప్పాడు. వరసగా మూడు మ్యాచ్ లు గెలవడమే తమ ముందున్న లక్ష్యం అని హోల్డర్ చెప్పాడు. 

PREV
click me!

Recommended Stories

కప్ పోయిందన్న బాధ ముఖంపై లేదు: విలియమ్సన్‌పై సచిన్ ప్రశంస
ప్రపంచకప్ హీరోలకు ర్యాంకుల పంట, టాప్ ప్లేస్‌ కోహ్లీదే..!!