‘మాకు ఆ జెర్సీనే కావాలి’

Published : Jun 27, 2019, 10:19 AM ISTUpdated : Jun 27, 2019, 10:20 AM IST
‘మాకు ఆ జెర్సీనే కావాలి’

సారాంశం

ప్రస్తుతం ప్రపంచకప్ లో జెర్సీల వివాదం మొదలైంది. ఇప్పటికే ఇంగ్లాండ్-భారత్ లో మ్యాచ్ లో టీం ఇండియా ఆరెంజ్ కలర్ జెర్సీ  వేసుకోవాలని తీసుకున్న నిర్ణయాన్ని కొందరు అభిమానులు వ్యతిరేకిస్తున్నారు. 


ప్రస్తుతం ప్రపంచకప్ లో జెర్సీల వివాదం మొదలైంది. ఇప్పటికే ఇంగ్లాండ్-భారత్ లో మ్యాచ్ లో టీం ఇండియా ఆరెంజ్ కలర్ జెర్సీ  వేసుకోవాలని తీసుకున్న నిర్ణయాన్ని కొందరు అభిమానులు వ్యతిరేకిస్తున్నారు. ఈ వివాదం ఇంకా ముగియకముందే... శ్రీలంక జట్టు.. తమ జెర్సీ విషయంలో పట్టుపట్టి సాధించుకుంది.

తమకు బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్ లో ఉండే జెర్సీనే తర్వాతి మ్యాచులకు కూడా కావాలని శ్రీలంక కోరుతోంది. ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో శ్రీలంక ఈ జెర్సీతో తలపడి విజయం సాధించింది.దీంతో తమకు ఈ జెర్సీ బాగా కలిసి వచ్చిందని.. దీనినే కంటిన్యూ చేస్తామని కోరింది.

ఇందుకోసం లంక.. ఐసీసీ అనుమతి కూడా సంపాదించింది.  సాధారణంగా ముదురు నీలం రంగు జెర్సీలను ధరించే శ్రీలంక ఆటగాళ్లు తర్వాత ఆడే మూడు మ్యాచ్‌ల్లో పసుపు, నీలి రంగు కలిసిన దుస్తుల్లో కనిపించనున్నారు. ప్రత్యేక విజ్ఞప్తి వల్ల శ్రీలంక ఈ జెర్సీలను ధరించేందుకు అనుమతి ఇస్తున్నామని ఐసీసీ పేర్కొంది.

PREV
click me!

Recommended Stories

కప్ పోయిందన్న బాధ ముఖంపై లేదు: విలియమ్సన్‌పై సచిన్ ప్రశంస
ప్రపంచకప్ హీరోలకు ర్యాంకుల పంట, టాప్ ప్లేస్‌ కోహ్లీదే..!!