నాటి పరిస్థితులే.. మళ్లీ: పాక్ 1992 సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తుందా..?

By Siva KodatiFirst Published Jun 26, 2019, 5:29 PM IST
Highlights

1992 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ నమోదు చేసిన మొదటి ఆరు ఫలితాలు.. తాజా టోర్నీలో సమానం కావడంతో తమ జట్టు నాటి సెంటిమెంట్‌ను రీపిట్ చేసి కప్ సాధిస్తుందని పాక్ అభిమానులు బలంగా నమ్ముతున్నారు.

ఏ మాత్రం అంచనాలేకుండా బరిలోకి దిగి సంచలనం సృష్టించడం పాకిస్తాన్ జట్టుకు అలవాటు. తలపండిన క్రీడా విశ్లేషకులకు సైతం ఆ జట్టు ఎప్పుడెలా ఆడుతుందో అంతు చిక్కదు. క్రికెట్‌లో కొన్ని సెంటిమెంట్లు అప్పుడప్పుడు రీపిట్ అవుతుంటాయి. తాజాగా పాక్ విషయంలోనూ అది నిజమని తేలింది.

1992 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ నమోదు చేసిన మొదటి ఆరు ఫలితాలు.. తాజా టోర్నీలో సమానం కావడంతో తమ జట్టు నాటి సెంటిమెంట్‌ను రీపిట్ చేసి కప్ సాధిస్తుందని పాక్ అభిమానులు బలంగా నమ్ముతున్నారు.

వెస్టిండీస్‌తో తన మొదటి మ్యాచ్‌ను ఆడిన పాకిస్తాన్ ఆ మ్యాచ్‌లో ఓటమి పాలైంది. రెండో మ్యాచ్‌లో పటిష్టమైన ఇంగ్లాండ్‌ను మట్టి కరిపించింది. తర్వాత శ్రీలంక‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.

ఆ తర్వాత ఆస్ట్రేలియా, భారత్ చేతిలో దారుణంగా ఓడిపోయింది. అయితే ఆ వెంటనే పుంజుకున్న పాక్.. దక్షిణాఫ్రికాను మట్టికరిపించి ఇంటికి పంపింది. ఇక 1992లో కూడా పాకిస్తాన్ ఆడిన మొదటి ఆరు మ్యాచ్‌ల ఫలితాలు ఇదే రకంగానే ఉన్నాయి.

నాటి ప్రపంచకప్‌లో కూడా పాక్ ఆడాల్సిన మూడో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఇక అప్పటి ఏడో మ్యాచ్‌లో పాకిస్తాన్ విజయం సాధించింది. తాజాగా బుధవారం న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కనుక పాక్ విజయం సాధిస్తే.. 1992 నాటి పరిస్థితులు రిపీట్ అవుతుందని.. తమ జట్టు ప్రపంచకప్‌ను సాధిస్తుందని ఆ దేశ అభిమానులు భావిస్తున్నారు. 

click me!