ధోనీ రిటైర్మెంట్ పై ఆసిస్ మాజీ క్రికెటర్ కామెంట్స్

By telugu teamFirst Published Jun 20, 2019, 10:34 AM IST
Highlights

టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుతం వరల్డ్ కప్ లో తన సత్తా చాటుతున్నారు. అయితే.. ఈ ప్రపంచ కప్ అనంతరం ధోనీ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందనే వార్తలు రోజుకొకటి పుట్టుకొస్తున్నాయి.

టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుతం వరల్డ్ కప్ లో తన సత్తా చాటుతున్నారు. అయితే.. ఈ ప్రపంచ కప్ అనంతరం ధోనీ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందనే వార్తలు రోజుకొకటి పుట్టుకొస్తున్నాయి. కాగా.. ధోని రిటైర్మెంట్ పై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గ్లెన్ మెక్ గ్రాత్  స్పందించారు.

ఆటను ఆస్వాదించినంత కాలం ధోనీని ఆడనివ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచకప్ తర్వాత కూడా ధోనీ తన ఆటను కొనసాగించాలని.. రిటైర్ అవ్వకుండా ఉంటేనే మంచిదని చెప్పాడు. ధోనీ స్ట్రైక్‌రేట్‌ గత రెండుమూడేళ్లుగా పడిపోతున్నందున అతని ఆటపై పలు విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మెక్‌గ్రాత్‌ తన అభిప్రాయం వెల్లడించాడని అర్థమవుతోంది.

ఇదిలా ఉండగా ధోనీ ప్రపంచకప్‌లో ఇటీవల పాకిస్థాన్‌పై 344వ వన్డే ఆడాడు. భారత్ తరుపున అత్యధిక వన్డేలు ఆడిన వారిలో మొదటి స్థానంలో సచిన్ ఉండగా.. రెండో స్థానంలో ద్రవిడ్, ధోనీ ఉన్నారు.
 

click me!