పాడుపని: లేగదూడపై యువకుడి లైంగిక దాడి

Published : Mar 13, 2020, 08:15 AM IST
పాడుపని: లేగదూడపై యువకుడి లైంగిక దాడి

సారాంశం

హైదరాబాదులోని నారాయణగుడా పోలీసు స్టేషన్ పరిధిలో ఓ యువకుడు లేగదూడపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ యువకుడు మహేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. అతను పశువుల కొట్టంలో పనిచేస్తూ ఉంటాడు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఓ యువకుడు అత్యంత నీచమైన పనికి పాల్పడ్డాడు. దాంతో అతను కటకటాల పాలయ్యాడు. 9 నెలల లేగదూడపై అతను లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన హైదరాబాదులోని నారాయణగుడా పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.

హైదరాబాదులోని హైదర్ గుడాలో గల అవంతినగర్ లో నివాసం ఉండే శివకుమార్ కు స్థానికంగా పశువుల కొట్టం ఉంది. అందులో మహేష్ అనే 30 ఏళ్ల యువకుడు పనిచేస్తున్నాడు. అతను బాల్యం నుంచి పశువుల కాపరిగా పనిచేస్తూ వస్తున్నాడు. 

బుధవారం రాత్రి మహేష్ లేగదూడపై లైంగిక దాడి పాల్పడ్డాడు. దాన్ని ఆ కొట్టం పక్కనే ఉన్న ఇంటి యజమాని కిశోర్ వర్మ చూశాడు. వెంటనే అతను నారాయణగుడా పోలీసులకు సమాచారం ఇచ్చాడు. 

నారాయణగుడా ఇన్ స్పెక్టర్ రమేష్ కుమార్, ఎస్సై నారాయణ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను పరిశీలించారు. ఆ తర్వాత మహేష్ ను అరెస్టు చేసారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad : ఈ శివారు ప్రాంతం మరో గచ్చిబౌలి కావడం ఖాయం.. ఇప్పుడే భూములు కొన్నారో మీ జాతకమే మారిపోతుంది
Rain Alert : హైదరబాదీలూ... ఈ సాయంత్రం జాగ్రత్త సుమా..! డేంజర్ వెదర్ అప్డేట్