World Disabled Day: నెక్లెస్‌ రోడ్‌లో దివ్యాంగుల అవగాహన ర్యాలీ

Published : Dec 03, 2019, 03:40 PM IST
World Disabled Day: నెక్లెస్‌ రోడ్‌లో దివ్యాంగుల అవగాహన ర్యాలీ

సారాంశం

ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో అవగాహన ర్యాలీ జరిగింది.  

హైదరాబాద్: ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో జీహెచ్‌ఎంసి  ప్రత్యేక కాక్యక్రమాన్ని నిర్వహించింది. మంగళవారం ఉదయం నెక్లెస్ రోడ్‌లో దివ్యాంగులతో అవగాహన నడక కార్యక్రమాన్ని చేపట్టారు. వికలాంగుల హక్కుల వేదిక, జీహెచ్‌ఎంసీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 

ఈ కార్యక్రమాన్ని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అలాగే రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో పాటు ఆయన సతీమణి కావ్యారెడ్డి, దివ్యాంగుల జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు, దివ్యాంగ హక్కుల వేదిక కార్యదర్శి జగదీశ్వర్, డిప్యూటీ కమిషనర్ పట్నాయక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


 

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్ లో బుధవారం నీటి సరఫరా బంద్.. ఈ ప్రాంతాల ప్రజలు ముందే జాగ్రత్తపడండి
Jubilee Hills లో కాంగ్రెస్ గెలవడానికి టాప్ 10 రీజన్స్ ఇవే...