లోక్ సత్తా నాయకులు జయప్రకాశ్ నారాయణ ఘోర రోడ్డు ప్రమాదం నుండి తృటిలో సురక్షితంగా బయటపడ్డారు. జూబ్లీహిల్స్ లో ఆయన ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురయ్యింది.
హైదరాబాద్: లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనం ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. అయితే ఈ ప్రమాదంనుండి జెపితో పాటు కారులో వున్నవారందరూ సురక్షితంగా బయటపడ్డారు.
ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. జయప్రకాశ్ నారాయణ ఒక ప్రయివేటు కార్యక్రమానికి కారులో వెళుతూ జూబ్లీ చెక్ పోస్ట్ కూడలిలో సిగ్నల్ పడటంతో ఆగారు. అయితే హటాత్తుగా వెనుక వైపు నుంచి వచ్చిన ఆటో వేగాన్ని నియంత్రించుకోలేక జెపి ప్రయాణిస్తున్న కారును వెనుకవైపునుండి బలంగా ఢీకొట్టింది.
undefined
read more డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య: రేవంత్, లెఫ్ట్ నేతలను అడ్డుకొన్న కాలనీవాసులు
దీంతో ఒక్కసారిగా టైరు పేలిపోవడంతో పాటు ఆటో ఢీకొన్న కారు వెనుక భాగం పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది. అయితే ఈ ప్రమాదంలో కారులో వున్న జెపితో పాటు మిగతవారెవ్వరికీ ఎలాంటి హాని జరగలేదు. కానీ ఆటోలో ప్రయాణిస్తున్న మహిళలకు మాత్రం తీవ్ర గాయాలయ్యాయి.
ఈ సంఘటనతో జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద దాదాపు అర గంట పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను క్రమబద్దీకరిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో జేపీతో పాటు వైబీఐ అధ్యక్షుడు మారంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి కూడా ఉన్నారు. వీరిద్దరు సురక్షితంగా ప్రమాదం నుండి బయటపడ్డారు.
read more చంద్రబాబు వాహనంపై దాడి కేసు... సిట్ ఏర్పాటు
ఆటోలో ప్రయాణిస్తున్న మహిళలకు తీవ్రంగా గాయాలవడంతో స్థానికులు వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయాలయినా వారి ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేనట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అసలు ఈ ప్రమాదానికి గల కారణాలపై ట్రాపిక్ సిగ్నల్ వద్దగల సిసి కెమెరాల రికార్డును పరిశీలిస్తున్నారు.