ప్రేయసితో కలిసి ఉన్న భర్తను పట్టుకున్న భార్య: దవడ పగిలింది

Published : Mar 19, 2020, 08:24 AM IST
ప్రేయసితో కలిసి ఉన్న భర్తను పట్టుకున్న భార్య: దవడ పగిలింది

సారాంశం

ఇంటికి రావడం మానేసిన భర్తపై కన్నేసిన భార్య అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించింది. ప్రేయసితో కలిసి ఉన్న అతన్ని ఆమె చూసింది. అంతే, అతను ఆమెపై దాడి చేశాడు. ఈ సంఘటన హైదరాబాదులో జరిగింది.

హైదరాబాద్: ప్రేయసితో చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్న భర్తను ఓ మహిళ పట్టుకుంది. ముగ్గురు పిల్లల తన భర్త ఇంటికి రావడం తగ్గించడంతో ఆమెకు అనుమానం వేసింది. అతని కదలికలపై నిఘా పెట్టింది. ప్రేయసితో కలిసి ఉన్న భర్తను ఆమె ఓ చోటు చూసింంది. అది ఆమె తప్పయింది. భర్త ఆమెపై దాడి చేశాడు. 

అతని కొట్టిన దెబ్బ ఆమె దవడ పగిలింది. పన్ను గుచ్చుకోవడంతో తీవ్రంగా గాయపడింది. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయం ఎదుట బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. మహేష్ అనే వ్యక్తికి 2002లో వివాహమైంది. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. రెండేళ్ల క్రితం అతడి భార్యకు మోనేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. 

మహేష్ ను అడ్డు తొలగించకోవడానికి అతడిపై నిద్రిస్తున్నప్పుడు యాసిడ్ పోసింది. అప్పటి నుంచి అతను భార్యకు దూరంగా ఉంటున్నాడు. భార్యపై అతను గత నెలలో హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశాడు. విచారణలో భాగంగా ఆమె బుధవారంనాడు ప్రియుడు మోనేష్ తో కలిసి హెచ్ఆర్సీకి వచ్చింది. విషయం తెలుసుకుని మోనేష్ భార్య అక్కడికి వచ్చింది.

హెచ్ఆర్సీ వద్ద భార్యను చూసిన మోనేష్ కు కోపం నశాళానికి ఎక్కింది. అంతే ఆమెపై పిడిగుద్దులు కురిపించాడు. దవడకు గాయమై రక్తమోడింది. దాంతో ఆబిడ్స్ పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad Vegetable Price : ఈ వీకెండ్ మార్కెట్స్ లో కూరగాయల ధరలు ఎలా ఉంటాయంటే..
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!