హైదరాబాద్ రింగ్ రోడ్డుపై నుంచి కిందపడ్డ లారీ: ఇద్దరు మృతి

Published : May 30, 2020, 09:07 AM ISTUpdated : May 30, 2020, 09:08 AM IST
హైదరాబాద్ రింగ్ రోడ్డుపై నుంచి కిందపడ్డ లారీ: ఇద్దరు మృతి

సారాంశం

హైదరాబాదు రింగ్ రోడ్డు వంతెన మీది నుంచి లారీ కింద పడడంతో ఇద్దరు మరణించారు. కీసర నుంచి మేడ్చల్ వైపు వెళ్తున్న లారీ అదుపు తప్పి రింగ్ రోడ్డు వంతెనపై నుంచి కింద పడింది.

హైదరాబాద్: తెలంగాణలోని మేడ్చల్ వద్ద హైదరాబాదు రింగ్ రోడ్డుపై నుంచి లారీ కింద పడింది. దీంతో ఇద్దరు మరణించారు. కీసర నుంచి మేడ్చల్ వైపు సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ ఓఆర్ఆర్ మీది నుంచి కింద పడింది. వేగంగా దూసుకొచ్చి వంతెనపై నుంచి లారీ కింద పడింది.

అతి వేగం వల్ల అదుపు తప్పి లారీ కింద పడినట్లు భావిస్తున్నారు. ప్రవీణ్, భాస్కర్ అనే ఇద్దరు వాహనంలోనే ఇరుక్కుపోయి మరణించారు. మద్యం సేవించి లారీ నడిపారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

వివరాలు అందాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?