అందమైన ఫొటోలతో యువకులకు ఎర: ఎన్నారై ఫిర్యాదుతో మాళవిక అరెస్ట్

Published : May 28, 2020, 04:47 PM IST
అందమైన ఫొటోలతో యువకులకు ఎర: ఎన్నారై ఫిర్యాదుతో మాళవిక అరెస్ట్

సారాంశం

మాళవిక అనే మహిళను హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వరుణ్ అనే ఎన్నారై ఇచ్చిన ఫిర్యాదుతో ఆమెను అరెస్టు చేశారు. తన వద్ద 65 లక్షల రూపాయలు కొట్టేసిందని ఆయన ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్: ఓ ఎన్నారై ఫిర్యాదుతో హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీసులు మాళవిక అనే మహిళను అరెస్టు చేశారు. తన వద్ద 65 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేసిందని వరుణ్ అనే ఎన్నారై పోలీసులకు ఫిర్యాదు చేశారు. డాక్టర్ అని చెప్పి తనను మోసం చేసిందని ఆయన ఫిర్యాదు చేశారు.  

హైదరాబాదులోని ఓ భూమి వివాదంలో తనకు డబ్బులు అవసరమని చెప్పి తన వద్ద 65 లక్షల రూపాయలు తీసుకుందని ఆయన చెప్పారు. అయితే, మాట్రిమోనీ సైట్లలో అందమైన ఫొటోలు పెట్టి మాళవిక యువకులకు వల వేయడంలో దిట్ట అని అంటున్నారు. 

గతంలో కూడా ఆమె మూడు సార్లు అరెస్టయినట్లు తెలుస్తోంది. ఆమె మోసానికి భర్తతో పాటు అత్తామామలుకూడా సహకరిస్తున్నారని అంటున్నారు. ఎన్నారై ఫిర్యాదు ఆమె మోసాలు మరిన్ని వెలుగు చూసే అవకాశం ఉందని తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

Tour Guide : వరుసగా మూడ్రోజుల సెలవులు... కేవలం 3 వేలకే 1 నైట్, 2 డేస్ టూర్, ప్లాన్ రెడీ
Hyderabad లో ఏఐ డేటా సెంటర్.. ఈ ప్రాంతం మరో హైటెక్ సిటీ కావడం ఖాయం