యువతిపై టీఆర్ఎస్ కార్పోరేటర్ దాడి...323, 509 సెక్షన్‌ల కింద పోలీస్ కేసు

By Arun Kumar PFirst Published Sep 14, 2020, 12:41 PM IST
Highlights

పార్కింగ్ విషయంలో చెలరేగిన చిన్న గొడవలో మాటా మాటా పెరగడంతో అధికారపార్టీ కార్పోరేటర్ ఓ యువతిపై దాడికి పాల్పడ్డాడు. 

హైదరాబాద్: పార్కింగ్ విషయంలో చెలరేగిన చిన్న గొడవలో మాటా మాటా పెరగడంతో అధికారపార్టీ కార్పోరేటర్ ఓ యువతిపై దాడికి పాల్పడ్డాడు. ఈ గొడవ కారణంగా శేరిలింగంపల్లి కార్పోరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పైనే కాకుండా యువతిపై కూడా కేసు నమోదయ్యింది. 

ఈ వివాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. శేరిలింగంపల్లి కార్పోరేటర్ నాగేందర్ యాదవ్ కుటుంబం లక్ష్మీవిహార్ ఫేజ్2 కాలనీలో నివాసముంటున్నారు. అదే కాలనీలో వేణుగోపాల్ అనే వ్యక్తి కుటుంబం కూడా నివాసముంటోంది. అయితే వేణుగోపాల్ కూతురికి, కార్పోరేటర్ కి మద్య పార్కింగ్ విషయంలో గొడవ మొదలయ్యింది. 

read more  భార్య చెల్లిలితో అక్రమ సంబంధం.. రెండు నెలల క్రితం లేచిపోయి..

దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగడంతో కోపోద్రిక్తుడయిన కార్పోరేటర్ యువతిపై దాడికి పాల్పడ్డారు. ఈ గొడవను తన మొబైల్ చిత్రీకరిస్తున్న వేణుగోపాల్ మరో కూతురిపై కూడా కార్పోరేటర్ దుర్భాషలాడినట్లు  తెలుస్తోంది. దీంతో ఆ కుటుంబం చందానగర్ పోలీస్ స్టేషన్ లో కార్పోరేటర్ పై ఫిర్యాదు చేయగా 323, 509 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు.

అయితే కార్పోరేటర్ నాగేందర్ కూడా సదరు యువతిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై కూడా పోలీసులు 448,504 సెక్షన్ల కింద కేసు పెట్టారు.  ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని... పూర్తయిన తర్వాత వివరాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. 


 

click me!