స్వలింగ సంపర్కం: విటుడ్ని బుక్ చేసుకుని బ్యాంక్ అధికారి న్యూసెన్స్

By telugu teamFirst Published Sep 11, 2020, 1:39 PM IST
Highlights

స్వలింగ సంపర్కానికి అలవాటు పడిన ఓ బ్యాంక్ అధికారి విటుడ్ని బుక్ చేసుకుని ఆ తర్వాత న్యూసెన్స్ చేశాడు. ఈ సంఘటన హైదరాబాదులోని అమీర్ పేటలో చోటు చేసుకుంది.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఓ అసహజమైన సంఘటన చోటు చేసుకుంది. స్వలింగ సంపర్కానికి అలవాడు పడిన ఓ బ్యాంక్ అధికారి అన్ లైన్లో విటుడిని బుక్ చేసుకుని న్యూసెన్స్ సృష్టించాడు. దాంతో పోలీసులు ఇద్దరిపై కూడా కేసు నమోదు చేశారు. 

హైదరాబాదులోని ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. వనస్థలిపుర ఆంధ్రా బ్యాంక్ శాఖలో పనిచేస్తున్న ఉన్నతాధికారి స్వలింగ సంపర్కానికి బానిసయ్యాడు. 

ఆన్ లైన్ల్ చాటింగ్ చేసిన ఎస్సార్ నగర్ సమీపంలోని బస్తీకి చెందిన విటుడిని 5 వేల రూపాయలకు బుక్ చేసుకున్నాడు. విటుడ్ని కలిసిందేకు ఆ అధికరాి ఈ నెల 7వ తేదీ అర్థరాత్రి దాటిన తర్వాత 3 గంటల సమయంలో బస్తీకి వెళ్లాడు. ఓ ఇంట్లోని మొదటి ఉన్న విటుడి వద్దకు వెళ్లాడు. అతను వికలాంగుడు కావడంతో ఆశ్చర్యపోయిన బ్యాంక్ అధికారి నిరాశతో వెనుదిరిగే ప్రయత్నం చేశాడు. 

అయితే, డబ్బులు ఇవ్వాల్సిందేనని విటుడు పట్టుబట్టడంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. గొడవ పెద్దది కావడంతో అదే సమయంలో మంచినీరు పట్టుకోవడానికి బయటకు వచ్చిన మహిళలు చూసి దొంగ కావచ్చునని అనుమానించారు. అతన్ని పట్టుకున్నారు. 

వారు ఆ తర్వాత 100కు డయల్ చేశారు. వెంటనే గస్తీ పోలీసులు అక్కడికి చేరుకుని వారిద్దరిని పోలీసు స్టేషన్ కు తరలించారు. బ్యాంక్ అధికారిపై, విటుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

click me!