కేసీఆర్ డిన్నర్ కు హైదరాబాదులో ట్రాఫిక్ ఆంక్షలు ఇలా...

By telugu teamFirst Published Dec 20, 2019, 11:44 AM IST
Highlights

క్రిస్ట్మస్ పర్వదినం సందర్భంగా ఎల్బీ స్టేడియంలో తెలంగాణ సీఎం కేసీఆర్ విందు ఇస్తున్నారు. ఈ సందర్బంగా హైదరాబాదులో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు క్రిస్మస్ సందర్బంగా శుక్రవారం డిన్నర్ ఇస్తున్నారు. ఈ డిన్నర్ కు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా పోలీసులు కొన్ని ట్రాఫిక్ ఆంక్షలను పెట్టారు. 

ట్రాఫిక్ అదనపు కమిషనర్ అనిల్ కుమార్ ట్రాఫిక్ ఆంక్షల గురించి వివరించారు. ఈ ఆంక్షలు శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అమలులో ఉంటాయని ఆయన చెప్పారు.

బాబూ జగజీవన్ రామ్ విగ్రహం వైపు వెళ్లే ట్రాఫిక్ ఆబిడ్స్ వద్ద ఎస్బీఐ గన్ ఫండ్రీ మీదుగా చాపెల్ రోడ్డుకు మళ్లిస్తారు. 

పాత ఎమ్మెల్యే క్వార్టర్ నుంచి ట్రాఫిక్ ను బషీర్ బాగ్ మీదుగా లిబర్టీ వైపు మళ్లిస్తారు. 

ఎంట్రీ, పార్కింగ్

గోల్డ్ కార్డు (ఎ-1) ఉన్నవారు ఖాన్ లతీఫ్ ఖాన్ భవనం వద్ది దిగి గేట్ 17లోంచి లోనికి ప్రవేశించాల్సి ఉంటుంది. వారికి ఆలియా మోడల్ స్కూల్లో పార్కింగ్ వసతి కల్పించారు. 

గ్రీన్ కార్డు (ఏ-2) హోల్డర్లు అలియా మోడల్ స్కూల్ ఎదురుగా ఉన్న డీ గేట్ వద్ద దిగి సాట్స్ గేట్ ద్వారా లోనికి ప్రవేశించాలి. వారికి ఆలియా కాలేజీ, మహబూబ్ కాలేజీ, ఆలియా స్కూల్స్ లో పార్కింగ్ వసతి ఉంటుంది. 

బ్లూ కార్డు (బీ-బ్లాక్) హోల్డర్లు ఆయకార్ భవన్ ఎదురుగా జీ గేట్ వద్ద దిగి గేట్ నెంబర్ 15 ద్వారా లోనికి ప్రవేశించాలి. వారికి పబ్లిక్ గార్డెన్స్ లో పార్కింగ్ వసతి కల్పించారు. 

పింక్ కార్డు (సీ - బ్లాక్) హోల్డర్ల్ బిజెఆర్ విగ్రహం వద్ద ఎఫ్, ఎఫ్1 గేట్ల వద్ద దిగి 6, 7 నెంబర్ గేట్ల ద్వారా లోనికి ప్రవేశించాలి. వారికి నిజాం కాలేజీ మైదానంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. 

click me!