ఏపీ సీఎం జగన్‌కు ఈడీ సమన్లు.. 11న హాజరు కావాలంటూ..

By AN TeluguFirst Published Jan 9, 2021, 10:53 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డికి ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈనెల 11న విచారణకు హాజరుకావాలని ఈడీ కోర్టు ఆదేశించింది. ఇటీవల అరబిందో, హెటిరో భూ కేటాయింపుల చార్జిషీట్‌ నాంపల్లి కోర్టు నుంచి ఈడీ కోర్టుకు బదిలీ అయ్యింది. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డికి ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈనెల 11న విచారణకు హాజరుకావాలని ఈడీ కోర్టు ఆదేశించింది. ఇటీవల అరబిందో, హెటిరో భూ కేటాయింపుల చార్జిషీట్‌ నాంపల్లి కోర్టు నుంచి ఈడీ కోర్టుకు బదిలీ అయ్యింది. 

దీంతో అరబిందో, హెటిరో భూ కేటాయింపుల ఛార్జిషీట్‌ను ఈడీ కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ క్రమంలో సీఎం జగన్‌తో పాటు ఏపీ ఎంపీ విజయసాయిరెడ్డి, హెటిరో డైరెక్టర్‌ శ్రీనివాసరెడ్డి, అరబిందో ఎండీ నిత్యానందరెడ్డి, పీవీ రాంప్రసాద్‌రెడ్డి, ట్రైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ శరత్‌ చంద్రారెడ్డికి ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది. 

ఇదిలా ఉంటే ఏపీలో పంచాయతీ ఎన్నికల విషయంలో రచ్చ నడుస్తోంది. ఏపీ ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిర్ణయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించనుంది. రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. 

తాము ఎన్నికలను నిర్వహించలేదమంటూ ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడానికి సిద్ధపడుతోంది. కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయాల్సి ఉన్నందున స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని అంటూ ఎస్ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని నిలుపుదల చేయాలని వైఎస్ జగన్ ప్రభుత్వం కోర్టును కోరనుంది. 

నాలుగు దశలుగా స్థానికలు ఎన్నికలు నిర్వహిస్తామని నిమ్మగడ్డ రమేష్ కుమార్ శుక్రవారం ప్రకటించారు. కాగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయాల్సిన తరుణంలో ఎన్నికల నిర్వహణకు సిబ్బందిని నియోగించడం, ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయడం సాధ్యం కాదని ప్రభుత్వం అంటోంది.

కాగా, స్థానిక సంస్థల ఎన్నికలపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు, వైఎస్ జగన్ ప్రభుత్వానికి మధ్య వివాదం కొనసాగుతూ వస్తోంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ హయాంలో స్థానిక సంస్థలు నిర్వహించకుండా చూడాలనే వ్యూహాలతో జగన్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. తన హయాంలో ఎన్నికలు నిర్వహించాలనే పట్టుదలతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నారు. 
 

click me!