తప్పెవరిది? : రోడ్డుకు అడ్డంగా పరిగెత్తిన చిన్నారి.. ఢీ కొట్టిన టూ వీలర్.. చివరికి...

By AN TeluguFirst Published Dec 26, 2020, 10:02 AM IST
Highlights

ఓ చిన్నారి.. ఓ బైక్.. ఓ తల్లి.. ఇందులో తప్పెవరికి అంటే ఏమీ చెప్పలేని పరిస్థితి. ఎవరికీ ప్రాణనష్టం జరగలేదు కాబట్టి సమస్య లేదు. కానీ అదే ఆ చిన్నారికి ఏమైనా అయి ఉంటే.. ఆ బైక్ మీద వస్తున్న వాళ్ల జీవితాలు ఆగం అయ్యేవి... ఇంతకీ విషయం ఏంటంటే..

ఓ చిన్నారి.. ఓ బైక్.. ఓ తల్లి.. ఇందులో తప్పెవరికి అంటే ఏమీ చెప్పలేని పరిస్థితి. ఎవరికీ ప్రాణనష్టం జరగలేదు కాబట్టి సమస్య లేదు. కానీ అదే ఆ చిన్నారికి ఏమైనా అయి ఉంటే.. ఆ బైక్ మీద వస్తున్న వాళ్ల జీవితాలు ఆగం అయ్యేవి... ఇంతకీ విషయం ఏంటంటే..

శుక్రవారం బాలానగర్ ప్రాంతంలో ఓ యాక్సిడెంట్ జరిగింది. తల్లి చేయి పట్టుకుని వెళుతున్న ఓ బాలుడు హఠాత్తుగా రోడ్డు దాటేందుకు యత్నించాడు. అదే సమయంలో వేగంగా దూసుకువచ్చిన ఓ బైక్‌ ఆ చిన్నారిని ఢీకొట్టింది. రెప్పపాటు కాలంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో చిన్నారి తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఒక్కసారిగా రోడ్డుకు అడ్డంగా బాలుడు రావడంతో  షాక్‌కు గురైన వాహనదారుడు సొమ్మసిల్లి పడిపోయాడు. 

బాలానగర్, వినాయక్‌నగర్‌ కు చెందిన సాల్మాన్, కుమారి దంపతులు కుమారుడు విలియం కేర్.  శుక్రవారం క్రిస్మస్‌ సందర్భంగా కుమారి తన కుమారుడు విలియంకేర్‌తో కలిసి సమీపంలోని చర్చికి బయలుదేరింది. బీబీఆర్‌ ఆస్పత్రి వద్దకు రాగానే తల్లి చేయిపట్టుకుని నడుస్తున్న విలియంకేర్‌ ఒక్కసారిగా రోడ్డు అవతలి వైపునకు వెళ్లేందుకు పరుగెత్తాడు. అదే సమయంలో స్నేహితుడితో కలిసి బైక్‌పై బాలానగర్‌ వైపు వస్తున్న వివేక్‌ వర్మ అనే వ్యక్తి సడెన్‌గా రోడ్డు మధ్యలోకి వచ్చిన బాలుడిని ఢీకొనడంతో చిన్నారి కిందపడ్డాడు.

గిలగిలా తన్నుకుంటున్న బాలుడిని స్థానికులు అక్కున  చేర్చుకుని సపర్యలు చేశారు. ఈ ఘటనతో షాక్‌కు గురైన తల్లి కుమారి బోరున విలపించింది. అదృష్టవశాత్తూ బాలుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఇదిలా ఉండగా ఈ ఘటనతో షాక్‌కు గురైన వాహనదారుడు వివేక్‌ వర్మ అక్కడే రోడ్డుపై కుప్పకూలిపోయాడు. తనతో వచ్చిన స్నేహితుడితో పాటు స్థానికులు అతనికి సైతం సపర్యలు చేయడంతో షాక్‌ నుంచి కోలుకున్నాడు. సంబంధిత వీడియోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ తప్పెవరిది అంటూ ట్వీట్ చేసింది. 

click me!