బ్రేకింగ్ : జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం.. పోలింగ్ కావడంతో..

Bukka Sumabala   | Asianet News
Published : Dec 01, 2020, 11:38 AM IST
బ్రేకింగ్ : జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం.. పోలింగ్ కావడంతో..

సారాంశం

ఓ వైపు బల్దియా ఎన్నికల పోలింగ్ తో నగరం హీటెక్కితే.. మరోవైపు భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జీడిమెట్ల పోలీసు స్టేషన్‌ పరిధిలోని పారిశ్రామిక వాడ ఫేజ్‌ -4లో అగ్ని ప్రమాదం జరిగింది. 

ఓ వైపు బల్దియా ఎన్నికల పోలింగ్ తో నగరం హీటెక్కితే.. మరోవైపు భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జీడిమెట్ల పోలీసు స్టేషన్‌ పరిధిలోని పారిశ్రామిక వాడ ఫేజ్‌ -4లో అగ్ని ప్రమాదం జరిగింది. 

జీడిమెట్ల ఫేజ్‌-4లోని హైటెక్‌ అలుకాస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. అయితే ఈ రోజు ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా సెలవు దినం కావడంతో కార్మికులెవరూ లేరు. దీంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. 

అగ్ని ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో కంపెనీకి రావడంలో మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. 

ఈ ప్రమాదంలో సుమారు రూ. 5 లక్షల వరకు ఆస్థి నష్టం జరిగి ఉండొచ్చని కంపెనీ యాజమాన్యం చెబుతోంది. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానికి కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. దీనికి గల కారణాలు తెలుసుకునే పనిలో యాజమాన్యం పడిపోయింది. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : హైదరాబాద్ వీకెండ్ మార్కెట్స్ లో కూరగాయల ధరలివే..
ఈ వీకెండ్ హైదరబాదీలకు కష్టాలు తప్పవు... బయటకు వెళ్లారో బుక్ అయినట్లే..!