హైదరాబాద్ ప్రజలు ఎలాంటి వారిని ఆదరించాలంటే: మంత్రి కేటీఆర్

By Arun Kumar PFirst Published Nov 13, 2020, 12:53 PM IST
Highlights

శుక్ర‌వారం ఉద‌యం సనత్‌నగర్‌ నియోజకవర్గంలో మంత్రులు కేటీఆర్, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ క‌లిసి ప‌ర్య‌టించారు. 

హైదరాబాద్: హైద‌రాబాద్‌ను విశ్వ‌న‌గ‌రంగా తీర్చిదిద్దేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామని ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్ అన్నారు. కాబట్టి నగర ప్రజలు దీన్ని గుర్తించి పనిచేసే ప్రభుత్వాన్ని ఆదరించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. 

శుక్ర‌వారం ఉద‌యం సనత్‌నగర్‌ నియోజకవర్గంలో మంత్రులు కేటీఆర్, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ క‌లిసి ప‌ర్య‌టించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడంతో పాటు నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాలను ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ర్టంలో డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం స‌న‌త్ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచే చేప‌ట్టామన్నారు. నగర ప్ర‌జ‌ల‌కు మెరుగైన సౌక‌ర్యాలు అందించాల‌ని సీఎం కేసీఆర్ చెప్పారని... ఆయన సూచనల ప్రకారమే హైదరాబాద్ ను అన్నిరకాలుగా అభివృద్ది చేస్తున్నామన్నారు. ఈ నగరాన్ని విశ్వ‌న‌గ‌రంగా తీర్చిదిద్దేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. 

click me!