ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసు మరో ములుపు తిరిగింది. ఈ కేసులో ఇప్పటికే అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ ఐఎఎస్ శర్మపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదయ్యింది.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు మరో మలుపు తిరిగింది. అక్రమాస్తుల సంపాదనలో జగన్ కు సహకరించారన్న అభియోగాలు శర్మపై వున్నాయి. ఆ జాబితాలోకి తాజాగా మరో కేసు చేరింది.
ప్రభుత్వం నుండి న్యాయ సహాయం పొందిన ఆయన నకిలీ బిల్లులు సృష్టించి లక్షల రూపాయలు పొందారంటు సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు అందింది. బిల్లుల విడుదల విషయంలో శర్మకు మాజీ సీఎస్ పీకే మహంతి, మాజీ రెవెన్యూ కార్యదర్శి పివి రమేష్ సహకరించారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు.
undefined
జగన్ అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఏడుగురు ఐఏఎస్ లకు అప్పటి ప్రభుత్వం న్యాయ సహాయానికి నిధులు విడుదల చేసింది.అప్పటి నీటిపారుదల శాఖ కార్యదర్శి సివిఎస్‌కె శర్మ ప్రభుత్వానికి న్యాయ సహాయ బిల్లులు అందజేయడంలో చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణ వచ్చాయి.
read more జగన్ పాలనలో భారీ అవినీతి... స్వయంగా ఉపముఖ్యమంత్రే ఒప్పుకున్నారు...: జవహార్
తప్పుడు బిల్లులతో లక్షల రూపాయల నిధులు విడుదల చేసినట్టు సైఫాబాద్ పోలీసులకు తాజాగా ఓ ఫిర్యాదు అందింది. శర్మ పెట్టిన బిల్స్ ను సరిగ్గా పరిశీలించకుండానే ఆనాటి సిసిఎస్ పీకే మహంతి సంతకాలు చేశారని ఫిర్యాదుదారుడు రమణ పేర్కొన్నారు.
దీంతో అప్పటి రెవెన్యూ ముఖ్య కార్యదర్శి టివి రమేష్ నిధులు విడుదల చేశారని తెలిపారు.ఈ వ్యవహారంపై కేసు నమోదు చేయాలంటూ రమణ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్లు సైఫాబాద్ పోలీసులు వెల్లడించారు.
గతంలో టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న జగన్ అక్రమాస్తుల కేసును తెలంగాణ ముఖ్యమంత్రి నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడిలా మారిపోయాడని...అందువల్లే కాపాడే ప్రయత్నం జరుగుతోందని అన్నారు.
విజయసాయిరెడ్డి దొంగతనం ఎలా చేయాలో ప్లాన్ గీస్తే జగన్ దానిని పక్కాగా ఫాలో అవుతారని బుద్దా ఫైరయ్యారు. జగన్‌ను కాపాడాల్సిందిగా సీబీఐ ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయం నుంచి హుకుం జారీ అయ్యిందని వెంకన్న ఆరోపించారు.దానితో పాటు జగన్ ఏది చెబితే అది చేయమని కూడా సీబీఐని ప్రధాని ఆదేశించారని విమర్శించారు. అందుకు తగ్గట్టుగానే తెలుగుదేశం పార్టీ నేతలు, సానుభూతిపరులపై సీబీఐ దాడులు జరుగుతున్నాయని బుద్దా మండిపడ్డారు.
హిందూజా కంపెనీ భూములు జగన్ అండ్ కోకు కట్టబెట్టినట్లు సాక్ష్యాధారాలున్నాయని దీనిపై సమాధానం చెప్పాల్సిందిగా విజయసాయిరెడ్డికి వెంకన్న సవాల్ విసిరారు. దేశానికి నేను కాపలాదారుడినని మోడీ అంటున్నారని.. అయితే ఆయన దేశానికి కాపలాదారు కాదని జగన్ అవినీతికి కాపలాదారుడని వెంకన్న ఫైర్ అయ్యారు.