మూసీ వరదల్లో కొట్టుకొచ్చిన మొసలి: పట్టుకున్న యువకులు

By telugu teamFirst Published Oct 14, 2020, 5:00 PM IST
Highlights

మూసీ నది వరదల్లో మొసలి కొట్టుకుని వచ్చింది. అంబర్ పేట వద్ద కనిపించిన మొసలిని యువకులు పట్టుకున్నారు. అధికారులు దాన్ని జంతు ప్రదర్శన శాలకు తరలించారు.

హైదరాబాద్:  అనూహ్యంగా హైదరాబాదులో మూసీనది ఉప్పొంగి పారుతోంది. మూసీనది వరదల్లో ఓ మొసలి కొట్టుకుని వచ్చింది. యువకులు దాన్ని పట్టుకున్నారు. అంబర్ పేట వద్ద దాన్ని పట్టుకున్నారు. అధికారులు దాన్ని జూపార్కుకు తరలించారు.

కాగా, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు మెట్రో రైలుకు ముప్పు పొంచి ఉంది. మూసాపేట వద్ద భూమి కుంగిపోయింది. భారీ వర్షాలకు ఈ సంఘటన సంభవించింది. దీంతో స్థానికులు, ప్రయాణికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. పిల్లర్ చుట్టూ ఉన్న సెక్యురిటీ వాల్ కొట్టుకుపోయింది. పిల్లర్ వద్ద పెద్ద గొయ్యి ఏర్పడింది. వరద తాకిడికి ఇది ఏర్పడింది.

Also Read: హైదరాబాద్‌లో తలసాని సుడిగాలి పర్యటన, దగ్గరుండి సహాయక చర్యలు

సర్ఫేస్ వాల్ మీద పిల్లర్ ను నిర్మించడం వల్ల ఈ ఇది సంభవించినట్లు భావిస్తున్నారు. రెండు మెట్రో పిల్లర్ల చుట్టూ రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో మెట్రో రైళ్లు మియాపూర్ వైపు తిరుగుతున్నాయి. ఎల్బీనగర్, మియాపూర్ మధ్య మెట్రో రైళ్లు తిరుగుతున్నాయి. 

ఈ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు. వరద తాకిడికి మూసాపేట రోడ్లు తుడిచిపెట్టుకుపోయాయి. మెట్రో స్టేషన్ కిందనే భూమి కుంగిపోవడం ప్రమాద స్థాయిని తెలియజేస్తోంది. నీటిని తొలగించే ప్రయత్నాలు సాగిస్తున్నారు.

Also Read: సెల్లార్‌లోకి వరద నీరు: నీటిలో పడి బాలుడి మృతి

ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు చిగురాటుకాల వణుకుతోంది. భారీ వర్షాలు హైదరాబాదులో బీభత్సం సృష్టించాయి. ఇప్పటి వరకు వర్షానికి సంబంధించిన కారణాలతో 15 మంది మృత్యువాత పడ్డారు. పాతబస్తీలో 9 మంది మరణించిన విషయం తెలిసిందే. గగన్ పహాడ్ వద్ద మూడు మృతదేహాలు వరదలో కొట్టుకుని వచ్చాయి. మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది.

చాదర్ ఘాట్ వద్ద మూసీ నది ప్రమాదకరమైన స్థాయిలో ప్రవహిస్తోంది. ఉస్మాన్ సాగర్ కు వరద నీరు పెరిగింది. హైదరాబాదులో దాదాపు 1500 కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అపార్టుమెంటుల్లోని సెల్లార్లు నీటితో నిండిపోయాయి. ముందు జాగ్రత చర్యగా అపార్టుమెంట్లలోని లిఫ్టులను నిలిపేశారు. హైదరాబాదులో పలు ప్రాంతాలు మంగళవారం రాత్రి నుంచి కరెంట్ లేక చీకట్లో మగ్గుతున్నాయి. 

హైదరాబాదులో రోడ్లు నదుల్లా, కాలనీలు చెరువుల్లా మారాయి. ఘట్కేసర్ లో అత్యధికంగా 32.3 శాతం వర్షపాతం నమోదైంది. చాలా ప్రాంతాల్లో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. 

వరంగల్, హైదరాబాదు జాతీయ రహదారిపై వరద నీరు పెద్ద యెత్తున ప్రవహిస్తోంది. మైలార్ దేవ్ పల్లిలో రెండు బస్సులు వరదలో చిక్కుకున్నాయి.  ప్రయాణికులు బస్సుపైకి ఎక్కి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. వాటిని వెలికి తీసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. 

click me!