ఎంఐఎంకు ఎప్పుడు అడిగితే అప్పుడు పర్మిషన్.. మాకెందుకు ఇవ్వరు: రాజాసింగ్

By sivanagaprasad KodatiFirst Published Dec 27, 2019, 9:02 PM IST
Highlights

పోలీసులు ఉద్దేశ్యపూర్వకం గానే రేపటి బహిరంగ సభకు అనుమతి నిరాకరించారని ఆరోపించారు గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. 

పోలీసులు ఉద్దేశ్యపూర్వకం గానే రేపటి బహిరంగ సభకు అనుమతి నిరాకరించారని ఆరోపించారు గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ఎంఐఎం పార్టీ ఎలాంటి సభలు నిర్వహించినా అనుమతి ఇచ్చే పోలీసులు బీజేపీకి ఎందుకు ఇవ్వరని ఆయన ప్రశ్నించారు.

ఏంఐఎంకు తొత్తులుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని.. సిఏఏ అనుకూలంగా సభ జరపాలని నిర్ణయించామని రాజాసింగ్ స్పష్టం చేశారు. రేపు అనుమతి నిరాకరించారు కాబట్టి.. 30 వ తేదీన ఇందిరాపార్కు వద్ద సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు.

Also Read:కేసీఆర్ తర్వాత కేటీఆరే సీఎం: మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలనం

కాగా తమ సభకు అనుమతిని ఇవ్వకపోవడంపై కాంగ్రెస్ నేతలు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా రంగంలోకి దిగిన టీకాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పోలీసులపైనా, ప్రభుత్వంపైనా విమర్శలు చేశారు.

రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడిన మోహన్ భగవత్‌ సభకు ఎలా అనుమతిచ్చారని ఆయన ప్రశ్నించారు. అదే సమయంలో తిరంగా యాత్ర చేస్తామంటే తమకు ఎందుకు అనుమతివ్వరని ఉత్తమ్ నిలదీశారు.

Also Read:మున్సిపల్ ఎన్నికలు 2020: ఎవరి ధీమా వాళ్లదే

తెలంగాణలో ఇండియన్ పోలీస్ సర్వీస్ కాకుండా కల్వకుంట్ల పోలీస్ సర్వీస్ అమలవుతోందని ఆయన చురకలంటించారు. శనివారం ఉదయం 11 గంటలకు గాంధీభవన్‌కు తమ నేతలు, నాయకులు, కార్యకర్తలు అందరూ చేరుకోవాలనా ఉత్తమ్ పిలుపునిచ్చారు

click me!