ఎఫ్‌బీలో కూతురి మార్ఫింగ్ ఫోటోలు... తండ్రికి లింక్: డిలీట్ చేయాలంటే..!!!

By Siva KodatiFirst Published Jul 15, 2020, 6:14 PM IST
Highlights

కరోనా వైరస్ సమయంలోనూ కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. మహిళ నుంచి చిన్నారుల వరకు ఎవరినీ వదలడం లేదు. తాజాగా 9 ఏళ్ల బాలిక ఫోటోలను అసభ్యంగా మార్పింగ్ చేసిన ఓ వ్యక్తి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందాడు

కరోనా వైరస్ సమయంలోనూ కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. మహిళ నుంచి చిన్నారుల వరకు ఎవరినీ వదలడం లేదు. తాజాగా 9 ఏళ్ల బాలిక ఫోటోలను అసభ్యంగా మార్పింగ్ చేసిన ఓ వ్యక్తి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందాడు.

తన కుమార్తె ఫోటోలు సోషల్ మీడియాలో చూసి దిగ్భ్రాంతి చెందిన బాలిక తండ్రి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళితే.. ఓ ప్రైవేట్ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక ఫోటోలను కొందరు వ్యక్తులు అసభ్యంగా మార్ఫింగ్ చేసి జూన్ 27న ఆమె తండ్రికి వాట్సాప్‌లో పంపించారు.

అంతటితో ఆగకుండా ఎఫ్‌బీలో ఖాతా తెరిచి అందులో పోస్ట్ చేశారు. ఆ లింక్‌ను కూడా ఆయనకి పంపించి, నీ కుమార్తె ఫోటోలు దిలీట్ చేయాలంటే అడిగినంత డబ్బులివ్వాలంటూ డిమాండ్ చేశారు. దీంతో దిగ్భ్రాంతి చెందిన బాలిక తండ్రి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు... నిందితులు పేర్కొన్న ఫోన్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. 

click me!