9న సౌదీ నుంచి హైదరాబాద్ కు: పాతబస్తీలో కరోనా అనుమానితుడు

By telugu teamFirst Published Mar 21, 2020, 3:52 PM IST
Highlights

హైదరాబాదులోని పాతబస్తీలో గల బార్కాస్ ఆస్పత్రికి ఓ కరోనా అనుమానితుడు వచ్చాడు. అతను ఈ నెల 9వ తేదీన సౌదీ నుంచి హైదరాబాదు వచ్చాడు. జగ్గు, జ్వరంతో అతను ఆస్పత్రికి వచ్చాడు.

హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీ లోని బార్కాస్ ఏరియా ఆస్పత్రిలో కొరొనా అనుమనితుడు దర్శమిచ్చాడు. విపరీతమైన దగ్గు, జ్వరం, ఛాతీ నొప్పితో ఆస్పత్రికి వచ్చాడు. ఈ నెల 9న అతను సౌదీ నుంచి హైదరాబాద్ వచ్చాడు.హైదరాబాద్ నుండి ఢిల్లీకి వెళ్తున్న రాజధాని ఎక్స్ ప్రెస్ లో ఇద్దరు కరోనా అనుమానిత ప్రయాణికులు కనిపించారు. 

ఏప్రిల్ 5 తేదీ వరకు ఎక్కడికి వెళ్లొద్దని వికారాబాద్ వైద్యులు హెచ్చరించారు. అయినా వైద్యుల మాట వినకుండా ఢిల్లీకి రవి, పూజ అనే ఇద్దరు బయలుదేరారు. వారి చేతికి డాక్టర్లు వేసిన మార్క్.. చూసి  తోటి ప్రయాణికులు గుర్తు పట్టారు. కాజిపేట్ రైల్వే స్టేషన్ లో వారిద్దరిని దింపి అంబులెన్సు లో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి రైల్వే పోలీసులు తరలించారు. రవి , పూజ లు ప్రయాణిస్తున్న కోచ్ బీ-3లోని ప్రయాణికులను మరో బోగిలోకి మార్చారు. బీ -3 కోచ్ ను అధికారులు పూర్తిగా శానిటైజ్ చేశారు. అది ఢిల్లీకి తిరిగి బయలుదేరింది.

వరంగల్ జిల్లాలో కరోనా అనుమానితుల జంట బయటపడింది. నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తున్న జంటకు కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్లు అనుమానించిన విషయం తెలిసిందే. దాంతో కాజీపేటలో నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ ను ఆపేశారు. నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ రైల్లోని ప్రయాణికులు, రైల్వే అధికారులు తీవ్రమైన ఆందోళనకు గురయ్యారు. వారిద్దరిని వరంగల్ లోని ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. 

ఇదిలావుంటే, ఖమ్మం జిల్లాలో మథిర వద్ద కృష్ణా ఎక్స్ ప్రెస్ ఐదో బోగీలో ప్రయాణిస్తున్నవారికి కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానించారు. దాంతో రైలును ఆపేసి శానిటైజ్ చేసి తర్వాత కదిలించారు.

click me!