భీభత్సం... నిర్లక్ష్యపు డ్రైవింగ్, ఇద్దరు చిన్నారులపైకి దూసుకెళ్లిన కారు

Arun Kumar P   | Asianet News
Published : Dec 18, 2020, 10:46 AM ISTUpdated : Dec 18, 2020, 10:56 AM IST
భీభత్సం... నిర్లక్ష్యపు డ్రైవింగ్, ఇద్దరు చిన్నారులపైకి దూసుకెళ్లిన కారు

సారాంశం

ఓ మహిళ ర్యాష్ డ్రైవింగ్ ఇంటి బయటకు ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారుల ప్రాణాలపైకి తెచ్చింది. 

హైదారబాద్‌: ఓ మహిళ నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఇద్దరు చిన్నారుల ప్రాణాలమీదకు తెచ్చింది. ఇంటి బయటకు ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులపైకి దూసుకెళ్లిన కారు భీభత్సం స్రుష్టించింది. ఈ ఘటన హైదరాబాద్ పాతబస్తీలో చోటుచేసుకుంది. 

పాతబస్తీలోని మిశ్రీగంజ్‌లో ఇద్దరు చిన్నారులు ఇంటి బయట ఆడుకుంటుండగా వారిపైకి ఓ కారు దూసుకొచ్చింది. ఓ మహిళ నిర్లక్ష్యంగా కారు డ్రైవింగ్ చేస్తూ ఈ ప్రమాదానికి కారణమయ్యింది. కారు కింద పడి ఓ చిన్నారి రెండు కాళ్లు విరిగిపోయాయి. అయితే ఈ ప్రమాదం నుండి మరో బాలుడు సురక్షితంగా బయటపడ్డాడు. గాయపడిన బాలున్ని కుటుంబసభ్యులు దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఈ ప్రమాదానికి కారణమైన మహిళ ఇటీవలే యూఏఈ నుండి వచ్చినట్లు తెలుస్తోంది. కారును రివర్స్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

IT Jobs : హైదరాబాద్ ఐటీకి పూర్వవైభవం.. ఉద్యోగాల భర్తీలో ఫిబ్రవరి నయా రికార్డ్
Heat Wave Alert : ఈ నాల్రోజులు చుక్కలే... ఈ జిల్లాల్లో 40 డిగ్రీల టెంపరేచర్స్, ఎల్లో అలర్ట్