ఎర్రగడ్డ పండ్ల మార్కెట్లో కారు బీభత్సం: మద్యం మత్తులో డ్రైవర్

Published : May 08, 2020, 03:50 PM IST
ఎర్రగడ్డ పండ్ల మార్కెట్లో కారు బీభత్సం: మద్యం మత్తులో డ్రైవర్

సారాంశం

హైదరాబాదులోని ఎర్రగడ్డ పండ్ల మార్కెట్ లో కారు బీభత్సం సృష్టించింది. కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడు. పోలీసులు కారును స్వాధీనం చేసుకుని, డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఘోర కారు ప్రమాదం సంభవించింది. ఎర్రగడ్డ పండ్ల మార్కెట్లో ఈ ప్రమాదం జరిగింది. ఎస్ఆర్ నగర్ పోలీసులు కారును స్వాధీనం చేసుకుని, డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.

మద్యం మత్తులో డ్రైవర్ డివైడర్ ను ఢీకొట్టాడు. అయితే, ప్రమాదమేమీ సంభవించలేదు. ఎయిర్ బెలూన్స్ సహాయంతో అతను బయపడ్డాడు.

హైదరాబాదులోని కెపీహెచ్ బీ వద్ద ఓ లారీ మెట్రో పిల్లర్ ను ఢీకొట్టింది. దీంతో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ ఘటన జరిగినప్పుడు అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

హైదరాబాదులో పలు చోట్ల లాక్ డౌన్ కారణంగా రద్దీ లేదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం రద్దీ పెద్ద యెత్తున ఉన్నట్లు తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?