ఓయు పీజీ హాస్టల్లో విద్యార్థి అనుమానాస్పద మృతి

Published : Feb 17, 2020, 05:57 PM ISTUpdated : Feb 17, 2020, 06:03 PM IST
ఓయు పీజీ హాస్టల్లో విద్యార్థి అనుమానాస్పద మృతి

సారాంశం

ఉస్మానియా విశ్వవిద్యాలయం పీజీ హాస్టల్లో నరసయ్య అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. విద్యార్థులు అక్కడికి పెద్ద యెత్తున చేరుకున్నారు. దాంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో గల ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయు) పీజీ హాస్టల్లో ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. పీజీ హాస్టల్ లోని రూమ్ నెంబర్ 3లో నరసయ్య అనే విద్యార్థి శవమై కనిపించాడు. నరసయ్య జాగ్రఫీ డిపార్టుమెంట్ లో పిహెచ్ డీ పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

నరసయ్య మృతికి కారణాలు తెలియడం లేదు. ఓయూ సైన్క్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రతాప్ రెడ్డి, జితేందర్ నాయక్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ సాయంతో సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు.విద్యార్థులు హాస్టల్ వద్ద నిరసన ప్రదర్శనకు దిగారు. దాంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్ లో బుధవారం నీటి సరఫరా బంద్.. ఈ ప్రాంతాల ప్రజలు ముందే జాగ్రత్తపడండి
Jubilee Hills లో కాంగ్రెస్ గెలవడానికి టాప్ 10 రీజన్స్ ఇవే...