రోజుకి పదివేల అడుగులు వేస్తే ఏం జరుగుతుందో తెలుసా..?

By telugu news teamFirst Published Jan 26, 2021, 1:33 PM IST
Highlights

ప్రతిరోజూ పదివేల అడుగులు వేడయం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. అసలు రోజుకి పదివేల అడుగులు వేయడం వల్ల మనలో ఎన్ని కేలరీలు  వృథా అవుతాయో ఇప్పుడు చూద్దాం..

బరువు తగ్గాలని చాలా మంది అనుకుంటారు.  అందుకోసం ఎవరికి తోచిన పనులు వాళ్లు చేస్తుంటారు. ముందు తిండి తినడం మానేస్తారు. లేదంటే జిమ్ లో అడుగుపెట్టి.. కసరత్తులు చేసి బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తుంటారు.  అయితే.. ఇవన్నీ లేకుండా కేవలం నడక ద్వారా కూడా సులభంగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ప్రతిరోజూ పదివేల అడుగులు వేడయం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. అసలు రోజుకి పదివేల అడుగులు వేయడం వల్ల మనలో ఎన్ని కేలరీలు  వృథా అవుతాయో ఇప్పుడు చూద్దాం..

వెయ్యి అడుగులకు 30 నుంచి 40 క్యాలరీలు మన శరీరంలో ఖర్చు అవుతాయి. అంటే.. రోజుకి పదివేల అడుగులు వేయడం వల్ల 300 నుంచి 400 క్యాలరీలు ఖర్చు అవుతాయి. అయితే... అది కూడా మీరు ఉన్న బరువు, ఎత్తు మీద కూడా ఆధారపడి ఉంటుంది.

అయితే... కేవలం రోజుకి నేను పదివేల అడుగులు వేశాను కదా.. నేను బరువు తగ్గిపోవాలి అంటే కుదరదట. దీనికి తగ్గట్టుగా... ఆహారం కూడా తీసుకోవడం ముఖ్యం.

అంతేకాకుండా చిన్నపాటి వ్యాయామాలు కూడా చేస్తూ ఉండాలట. అలా చేసినప్పుడే సులభంగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. 

click me!