
మూత్రాశయం పొరలో అసాధారణ కణజాలాల పెరుగుదలనే మూత్రశయ క్యాన్సర్ అంటారు. యాక్షన్ బ్లాడర్ క్యాన్సర్ యూకే ప్రకారం.. ఈ క్యాన్సర్ ను ప్రారంభదశలో గుర్తించిన వారు 80 శాతం దీని నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. కానీ ఎక్కువ కేసులలో 25 శాతం ఈ క్యాన్సర్ తర్వాతి దశలోనే నిర్దారణ అవుతోంది. ముఖ్యంగా మహిళల్లో. నిజానికి మూత్రాశయ క్యాన్సర్ ఎక్కువ లక్షణాలను చూపించదు. అందుకే దీన్ని గుర్తించడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. అసలు ఈ క్యాన్సర్ లక్షణాలు ఎలాగుంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..
మూత్రంలో రక్తం
ఎన్ హెచ్ఎస్ యూకే ప్రకారం.. మూత్రంలో రక్తం పడటం అస్సలు మంచిది కాదు. ఇలా రక్తం పడితే మీకు అనారోగ్య సమస్యలున్నాయని అర్థం. ముఖ్యంగా మూత్రాశయంలో. మూత్రాశయం సమస్యలున్న 85 శాతం కేసులలో ఈ లక్షణం కనిపిస్తుంది. అయితే ఈ రక్తం కొన్ని సార్లు గులాబీ, నిండు ఎరుపు, గోధుమ రంగులో ఉంటుంది. ఇది ఎలాంటి నొప్పి లేకుండా ఉంటుంది. ఇది మూత్రాశయ క్యాన్సర్ కు సంకేతం.
మూత్రంలో రక్తానికి ఇతర కారణాలు
మూత్రంలో రక్తం పడినంత మాత్రానా మీకు మూత్రాశయ క్యాన్సర్ ఉన్నట్టు కాదు. ఎందుకంటే ఇలా చాలా సమస్యలకు అవుతుంది. ముఖ్యంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, బ్లేడర్ స్టోన్స్, పురుషులకు ఎక్కువగా వచ్చే ప్రొస్టేట్ క్యాన్సర్ వల్ల కూడా మూత్రంలో రక్తం వస్తుంది. ఏదేమైనా ఈ సమస్య ఉంటే వెంటనే హాస్పటల్ కు వెళ్లి టెస్టులు చేయించుకోవడం మంచిది.
గమనించాల్సిన ఇతర హెచ్చరిక సంకేతాలు
మూత్రాశయ క్యాన్సర్ ఉంటే మూత్రంలో రక్తం రావడంతో పాటుగా.. మూత్రం తరచుగా వస్తుంది. అంటే అకస్మత్తుగా మూత్రవిసర్జన చేయాలనిపిస్తుంది. అలాగే మూత్ర విసర్జన చేసేటప్పుడు మంట, దిగువ పొత్తికడుపు లేదా వెనుక భాగంలో నొప్పి, అలసట, ఆకలి లేకపోవడం, ఎముక నొప్పి వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.
మూత్రాశయ క్యాన్సర్ ను ఎలా తగ్గించాలి
అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం.. స్మోకింగ్ అలవాటును మానుకోవాలి. ఎందుకంటే ఇది క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. మూత్రాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి వాటర్ ఎంతో సహాయపడుతుందని నమ్ముతారు. అందుకే ప్రతిరోజూ తగినంత నీటిని తాగండి. అలాగే పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఉన్న ఆహారాలన్ని తినండి. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయని తేలింది.
క్యాన్సర్ కణాలు లైనింగ్ దాటి.. చుట్టుపక్కల మూత్రాశయ కండరాలలోకి వ్యాపిస్తే.. దానిని కండరాల ఇన్వాసివ్ మూత్రాశయ క్యాన్సర్ అంటారు. కానీ ఇది రేర్ గా జరుగుతుంది. కానీ ఇది శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించే అవకాశం ఉందని ఎన్ హెచ్ఎస్ యూకే పేర్కొంది. ఎముకలలో నొప్పి కలిగితే క్యాన్సర్ కణాలు మీ శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించాయని సంకేతమంటున్నారు నిపుణులు.