
Ramadan 2023: ప్రస్తుతం అడపాదడపా ఉపవాసానికి బలే క్రేజ్ వచ్చింది. ఇందులో ఉపవాసాన్ని రెండు విధాలుగా పాటిస్తారు. అయితే అడపాదడపా ఉపవాసం ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది సిర్కాడియన్ రిథమ్ ను సరిచేస్తుంది. ఈ అడపాదడపా ఉపవాసం గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు ఎంతగానో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. అడపాదడపా ఉపవాసం ఉంటే బరువు తగ్గడంతో పాటుగా మెదడు ఆరోగ్యం, ఎముకల ఆరోగ్యం, అధిక రక్తపోటు, మధుమేహం, గుండె ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
కొలెస్ట్రాల్, రక్తపోటు, ఇన్సులిన్, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం ద్వారా గుండెతో పాటుగా మీ మొత్తం ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతుున్నారు. అడపాదడపా ఉపవాసం కాలేయ కొలెస్ట్రాల్ సంశ్లేషణను నిరోధిస్తుంది. దీంతో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.
సీరం టీసీ, ఎల్డిఎల్-సి స్థాయిలు గుండె సమస్యలలో ఒకటైన అథెరోస్క్లెరోసిస్ కు అతిముఖ్యమైన ప్రమాద కారకాలు. ఉపవాసం శరీరాన్ని విష కణాల విచ్ఛిన్నం చేయడానికి, వ్యర్థ పదార్ధాలను బయటకు పంపడానికి దారితీస్తుంది. ఇది మంటను తగ్గిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
అడపాదడపా ఉపవాసం బరువు తగ్గడానికి ప్రయత్నించేవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది స్థూలకాయాన్ని తగ్గించడంలో కూడా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అడపాదడపా ఉపవాసం కీటోజెనిక్ స్థితిని ప్రేరేపిస్తుంది. ఇది అధిక బరువున్న వారికి సహాయపడుతుంది. ఈ ఉపవాసం β-హైడ్రాక్సీబ్యూటిరేట్ స్థాయిని పెంచుతాయి. 8-8 గంటల ఉపవాసం తర్వాత కీటోన్ స్థాయిలను గుర్తించొచ్చు.
ఇది కొవ్వు పేరుకుపోవడం నుంచి కొవ్వు వాడకం తగ్గడం ప్రారంభాన్ని సూచిస్తుంది. తక్కువ-సాంద్రత కలిగిన లిపోప్రొటీన్లు (ఎల్డిఎల్) లోపాన్ని కలిగి ఉంటాయి. అధిక-సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (హెచ్డిఎల్) స్థాయిలు పెరుగుతాయి. శరీరం గ్లూకోజ్ ను శక్తిగా ఉపయోగిస్తుంది.
జీవక్రియపై ప్రభావాలు
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కొవ్వు ఆమ్లాలు, కీటోన్లు ఈ ఉపవాసం సమయంలో శక్తి కోసం ఉపయోగించబడతాయి. ఈ మార్పును అడపాదడపా జీవక్రియ స్విచ్చింగ్ అంటారు. అడపాదడపా ఉపవాసం బరువు, లిపిడ్లు రెండింటినీ మెరుగుపరుస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
కీటోజెనిక్ ఆహారం తీసుకోవడం కంటే అడపాదడపా ఉపవాసం ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. కీటోజెనిక్ ఆహారంలో అధిక కొవ్వు తీసుకోవడం అంత మంచిది కాదు. ఎందుకంటే ఇది అధిక స్థాయిలో ట్రిమెథైలామైన్ ఎన్-ఆక్సైడ్ తో సంబంధం కలిగి ఉంటుంది. ఇది హృదయనాళ ప్రమాదంతో సంబంధం ఉన్న జీవక్రియ. ఇది కెటోజెనిక్ ఆహారంలో ఎక్కువగా ఉన్నట్టు కనుగొనబడింది.
హృదయ సంబంధ వ్యాధులపై ప్రభావాలు
పబ్మెడ్ సెంట్రల్ జర్నల్ రచయిత మెనూస్క్రిప్ట్ మెడికల్ జర్నల్ లో ప్రచురించిన పరిశోధన ప్రకారం.. ఇంటర్మౌంటైన్ హార్ట్ కొలాబరేటివ్ స్టడీ గ్రూప్ సుమారు 648 మంది రోగులపై ఈ ఉపవాసం ప్రభావాన్ని చూసింది. అడపాదడపా ఉపవాసం.. గుండె సమస్యలు ఉన్నా.. గుండెకు రక్షించడానికి సహాయపడుతుందని తేలింది. ఈ అధ్యయనంలో రంజాన్ మాసంలో ఉపవాసం ఉన్నవారిని కూడా చేర్చారు.
ఇస్కీమిక్ కార్డియోమయోపతి చరిత్ర ఉన్నవారు సంవత్సరంలోని ఇతర నెలలతో పోలిస్తే రంజాన్ సమయంలో గుండె ఆగిపోయే ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. నెల రోజుల పాటు ఉపవాసం ఉన్నవారికి కొరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని కనుగొన్నారు.